శిల్పా కోసం పోలీసులు, నంద్యాలలో హైడ్రామా, నేనే వస్తానంటూ అఖిల వార్నింగ్
నంద్యాల:పోలింగ్‌కు కొన్ని గంటల ముందే నంద్యాలలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకొంది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డిని నంద్యాల వదిలివెళ్ళాలని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఈ విషయమై పోలీసులు వ్యవహరించిన తీరుపై శిల్పా మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. మరోవైపు చక్రపాణిరెడ్డి నంద్యాల వదిలివెళ్ళకపోతే తాను కనూడ ఆళ్ళగడ్డ నుండి నంద్యాలకు వెళ్తానని మంత్రి అఖిలప్రియ హెచ్చరించారు.
మంగళవారం అర్ధరాత్రి నంద్యాలలో హైడ్రామా చోటుచేసుకొంది. స్థానికేతరులు నంద్యాలను విడిచివెళ్ళాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెండు పార్టీలకు చెందినే నేతలు నంద్యాల నియోజకవర్గంలోనే మకాం వేశారని పరస్పరం రెండు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకొన్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడ చేసుకొన్నారు.
అయితే పోలింగ్‌కు కొన్ని గంటల ముందే నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకొంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి రెండు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరోకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకొంటూనే ఉన్నారు.

నంద్యాల వదిలివెళ్ళాలని చక్రపాణిరె్డ్డి కోసం పోలీసులు
నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపఎన్నికల నేపథ్యంలో స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండొద్దంటూ పోలీసులు ఆదేశించారు. తన సోదరుడు చక్రపాణి రెడ్డిని నంద్యాల వదిలి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో శిల్పామోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఏజెంట్ ఫామ్ ల కోసం వచ్చిన వారిపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, ఆ ఫారాలను వారికి ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
Recommended Video


మా ఇంట్లో మేం ఉండకూడదా?
పోలింగ్ కోసం ఆయా పోలింగ్ స్టేషన్లలో ఏజంట్లకు సంబంధిత పత్రాలు ఇస్తుండగా పోలీసులు వారిని బయటకు తీసుకెళ్ళారని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఆరోపించారు. తమది ఉమ్మడి కుటుంబమని చక్రపాణిరెడ్డి కూడ మా ఇంట్లోనే ఉంటాడని మోహన్‌రెడ్డి చెప్పారు. నంద్యాలలోనే నివాసం ఉంటాం. అక్కడి నుండి ఎక్కడికి పోవాలని ఆయన పోలీసులను ప్రశ్నించారు.టిడిపి మంత్రులు , ఎమ్మెల్యేలు నంద్యాలలోనే తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు.

సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి
.తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడటం లేదని చెప్పారు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తనయుడు రవిచంద్రారెడ్డి చెప్పారు. తాము భయపడే రకం కాదని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిచంద్రకిశోర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి తమ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.పోలీసులను తమ ఇంటికి పంపాల్సిన అవసరం లేదని, అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు పనిచేస్తున్నట్టు కనబడుతోందని ఆరోపించారు. ఈ రోజు ఉదయం నుంచి తమ సేవా సంస్థలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారనిఆయన ఆరోపించారు.

నేను నంద్యాలకు వస్తా
శిల్పా చక్రపాణిరెడ్డి నాన్‌లోకల్. నంద్యాలలో ఎలా ఉంటారని మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తాను సమర్పించిన అఫిడవిట్‌లో శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూర్‌లో ఓటరుగా ఉన్నట్టుగా సమర్పించిన అఫిడవిట్‌ను మంత్రి అఖిలప్రియ మీడియాకు చూపారు..ఆధార్ కార్డును చూపి నంద్యాలలోనే ఉండాలని చక్రపాణిరెడ్డి ప్రయత్నిస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. ఓటరు కార్డు చూపాలని ఆయన సవాల్ విసిరారు. చక్రపాణిరెడ్డి నంద్యాల విడిచి వెళ్ళకపోతే తాను ఆళ్ళగడ్డ నుండి నంద్యాలకు వస్తానని మంత్రి అఖిలప్రియ సవాల్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications