సాయిశ్రీ చనిపోవడానికి 2 రోజుల ముందే లీగల్ నోటీసులు పంపిన శివకుమార్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: దుర్గాపురంలో లుకేమియా వ్యాధితో బాధపడుతూ రెండు రోజుల క్రితం మరణించిన మాదంశెట్టి వెంకటసాయికృష్ణ శివశ్రీ తల్లి సుమశ్రీకి చిన్నారి తండ్రి శివకుమార్ లీగల్ నోటీసులు పంపాడు.

సాయిశ్రీ చనిపోవడానికి రెండు రోజుల ముందే ఈ లీగల్ నోటీసులు శివకుమార్ పంపాడు.పోస్టు ద్వారా ఈ లీగల్ నోటీసులు శివకుమార్ పంపాడు.

saisree

నువ్వు పాపతో కలిసి ఫ్లాట్ ను ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలి. అందులో నీకు సంబంధించిన వారెవరు ఉండడానికి వీల్లేదు. అంటూ నోటీసులో పేర్కొన్నారు. అయితే తాజాగా మంగళవారం నాడు సుమశ్రీతో పాటు ఆమె సోదరులు, తోబుట్టువులు , స్నేహితులకు పేరు పేరున కేవియట్ అందాయి.

మీరంతా నా ఇంట్లో ఉంటున్నారు. ఖాళీ చేయమన్నా చేయడం లేదు. మీరు కోర్టుకు రండి అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫ్లాట్ ను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆ నోటీసులో ఉంది.

నన్నపనేని రాజకుమారి పరామర్శ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మంగళవారం నాడు సుమశ్రీని పరామర్శించారు. శివకుమార్, సుమశ్రీకి మధ్య గల వివాదాలను ఆమె అడిగి తెలుసుకొన్నారు. డబ్బులుండీ కూడ నా కుమార్తెకు శివకుమార్ వైద్యం చేయించలేదు. అతడి నిర్లక్ష్యం వల్లే శివశ్రీ చనిపోయింది. శివకుమార్ కు శిక్షపడాలి అని నన్పపనేనిని సుమశ్రీ కోరారు. అయితే ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా శివకుమార్ కు శిక్షపడేలా చేస్తామని నన్నపనేని హామీ ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shivakumar issued to legal notices to Sumasree by register post, before Saisree death.Saisree died on Sunday.Andhrapradesh state Mahila commission chairperson Nannapaneni Rajakumari visitation Sumasree on Tuesday.
Please Wait while comments are loading...