బాబు కాళ్లు పట్టుకోండి: శోభా నాగిరెడ్డి, ఆర్కెపైనా

రాష్ట్ర విభజనకు అనుకూలమంటూ గతంలో చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎవరిని నమ్మించడానికి పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీలు పగటి వేషాలు వేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబుకు సహాయం చేయాలనుకుంటే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చేసుకోవచ్చునని ఆమె అన్నారు.చేతనైతే జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని, అంతేగానీ జగన్‌పై దిగజారి వార్తలు రాయకూడదని ఆమె అన్నారు. ఇంగిత జ్ఝానం లేకుండా నీచంగా కథనాలు రాస్తున్నారని ఆమె విమర్శించారు. రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా సహకరించారని ఆమె ఆరోపించారు. అలాంటి కిరణ్ రెడ్డి ఇప్పుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఏం సాధించబోతున్నారని ఆమె అడిగారు. సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్నప్పుడే కిరణ్ తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications