పవన్ కళ్యాణ్ కు షాక్.. డిప్యూటీ సీఎం ప్రాధాన్యత తగ్గుతుందా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలను ఎవరు లెక్క చేయడం లేదా? తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో డిప్యూటీ సీఎం చేసిన డిమాండ్ ను పట్టించుకున్న నాధుడే లేడా? అన్నది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
పవన్ ఆదేశాలు బేఖాతరు చేసిన టీటీడీ అధికారులు
పవన్ కళ్యాణ్ షిప్ సీజ్ చేసిన ఘటన తరువాత అది ఏ విధంగా బూమరాంగ్ అయిందో.. అదే తరహాలో తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో మృతుల ఇళ్లకు వెళ్లి మరీ టిటిడి అధికారులు సారీ చెప్పాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు టిటిడి బోర్డుతో సహా ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోలేదని ఆయన ఆదేశాలను బేఖాతరు చేశారన్న చర్చ ప్రధానంగా జరుగుతోంది.

పవన్ చెప్పింది చెయ్యని టీటీడీ అధికారులు
వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం నిలబడి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి కుటుంబాలను ఇళ్లకు వెళ్లి పరామర్శించి వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నప్పటికీ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులు గాని ఈవో, జేఈవో కానీ వారి కుటుంబ సభ్యుల వద్దకు నేరుగా వెళ్లి క్షమాపణలు చెప్పి పరామర్శించలేదు.
వారిపై చర్యలు లేవు.. పవన్ పార్టీ సానుభూతిపరుడిపై చర్యలు
ఇక పవన్ కళ్యాణ్ తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘటనను ఉద్దేశించి మాట్లాడుతూ టిటిడి ఈవో, జేఈవో మధ్య విభేదాలు ప్రమాదానికి కారణమని వ్యాఖ్యలు చేశారు . అయినప్పటికీ వారిద్దరిపైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చంద్రబాబు ప్రభుత్వం తీసుకోలేదు. ఇక జనసేన సానుభూతిపరుడిగా ముద్ర పడిన డిఎస్పి రమణ్ కుమార్ ను చంద్రబాబు సస్పెండ్ చేయడం పవన్ కళ్యాణ్ మాటను లైట్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత తగ్గుతుంది అని చర్చ జరిగేలా చేస్తోంది.
క్షమాపణలు చెప్పిన టీటీడీ చైర్మన్... కానీ పవన్ ఆదేశించినట్టు కాదు
మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించకున్నా కనీసం బహిరంగ క్షమాపణ అయినా ఈవో, జేఈవో చేయలేదు. ఇక టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన వారు తిరిగి వస్తారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఆ తరువాత టిటిడి తరఫున మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఎవరూ లెక్కలోకి తీసుకోకపోవడం ఇప్పుడు ఏపీలో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది.
పవన్ ప్రాధాన్యత తగ్గుతుందా?
చంద్రబాబు క్రమంగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు అని చెప్పేలాగా ఈ ఘటన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన క్షమాపణ డిమాండ్ పైన లోకేష్ ఆ డిమాండ్ తో మాకు సంబంధం లేదంటూ వ్యాఖ్యలు చేయడంతో అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతుందని ప్రస్తుతం ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications