రైల్వే ప్రయాణికులకు షాక్.. వారికి ఏసీ, రిజర్వేషన్ బోగీలలో నో ఎంట్రీ!
ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఇండియన్ రైల్వే అప్పుడప్పుడు ప్రయాణికులు షాక్ అయ్యే నిర్ణయాలను కూడా తీసుకుంటుంది. తాజాగా ఇష్టానుసారంగా ప్రయాణం చేసే వారికోసం రైల్వే కొత్త రూల్ ని అమల్లోకి తీసుకువస్తోంది. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేసుకున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం కొంతమంది ప్రయాణికులకు షాక్ అని చెప్పాలి.
టికెట్ కన్ఫర్మ్ కాని వారికి రైల్వే కీలక సూచన
సహజంగా ట్రైన్లో ప్రయాణం చేయాలనుకునేవారు అడ్వాన్స్డ్ రిజర్వేషన్, కరెంట్ రిజర్వేషన్, జనరల్ టికెట్, తత్కాల్ టికెట్ ఇలా తమ టికెట్లను బుక్ చేసుకుంటారు. ఏసి, స్లీపర్ క్లాస్ టికెట్లను బుక్ చేసుకున్న వారు కన్ఫామ్ కాకపోయినప్పటికీ ఏసీ , స్లీపర్ క్లాస్ లో ప్రయాణం చేసే అవకాశం ఉండేది. అయితే ఇకపై టికెట్ కన్ఫర్మ్ కాని వారు అలా ప్రయాణం చేయడానికి వీలులేదని రైల్వే తేల్చి చెప్పింది.

స్లీపర్, ఏసీ బోగీలలోకి ఎక్కటానికి వీలు లేదు
టికెట్ కన్ఫర్మ్ కాని వాళ్ళు రిజర్వేషన్ క్యాబిన్లో ఎక్కడం కారణంగా అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేసుకున్నవారు టికెట్టు కన్ఫర్మేషన్ అయిన ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఈ కారణంగానే టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేవిధంగా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్న రైల్వే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు స్లీపర్, ఏసీ బోగీలలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.
మే 1 నుండి కొత్త రూల్
ఈ కొత్త రూల్ మే ఒకటవ తేదీ నుంచి అమలులోకి తీసుకు వస్తున్నట్టు పేర్కొంది. ఇక టికెట్ బుక్ చేసుకుని టికెట్ కన్ఫామ్ కాక వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు ఏసి, స్లీపర్ క్లాస్ లలో కాకుండా జనరల్ బోగీలో మాత్రం ప్రయాణం చేయవచ్చునని ఇండియన్ రైల్వే వెల్లడించింది. ఇక ఈ కారణంతో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు పొరపాటున కూడా స్లీపర్ మరియు ఏసీ బోగీలో ఎక్కకూడదు.
ఏసీ, స్లీపర్ కోచ్ లలో వారు ఎక్కితే జరిమానా
ఒకవేళ అలా ఎక్కితే జనరల్ కంపార్ట్మెంట్ కు తరలించేందుకు, జరిమానా విధించేందుకు టిటిఈ కి అధికారం ఉంది. ఇక అంతే కాదు ఏదైనా రైలులో టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉండి కన్ఫర్మ్ కాని వారికి, ఆ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరేటప్పుడు టికెట్ వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటే ఆటోమేటిగ్గా రద్దు అవుతుంది. కాబట్టి ఇకపై వెయిటింగ్ లిస్టులో ఉన్నా సరే రైల్లో ఏసీ కోచ్ లలో, రిజర్వేషన్ బోగిలలో ఎక్కుతాం అంటే ఇబ్బంది తప్పదు.












Click it and Unblock the Notifications