వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్ కు హైకోర్ట్ షాక్ .. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా కొనసాగనున్న అశోక్‌గజపతిరాజు

|
Google Oneindia TeluguNews

జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. రామ తీర్థానికి అనువంశిక ధర్మకర్త గా ఉన్న అశోక్ గజపతిరాజు తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా తొలగిస్తూ ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీంతో అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది.

కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలుకేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

ధర్మకర్త హోదా రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టిపారేసిన హైకోర్టు

ధర్మకర్త హోదా రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టిపారేసిన హైకోర్టు

మూడు ప్రముఖ దేవస్థానాలు ధర్మకర్త హోదా నుండి టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించిన విషయం విదితమే. రామతీర్థం రామాలయం, విజయనగరం పైడితల్లి, మందపల్లి ఆలయ ధర్మకర్త హోదా నుంచి అశోక్ గజపతిరాజు తొలగించిన ప్రభుత్వం, ఆయన హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీవో 65 ను ఉపసంహరిస్తూ దేవాదాయ శాఖ మెమో ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టిపారేసింది.

అనువంశిక ధర్మకర్తగా తొలగించటంతో న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు

అనువంశిక ధర్మకర్తగా తొలగించటంతో న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు

రామతీర్థం విగ్రహాల ధ్వంసం సమయంలో అశోక్ గజపతిరాజు అనువంశిక ధర్మకర్త గా ఉన్నారు. రామతీర్థం ఘటన తరువాత జగన్ సర్కార్ అశోక్ గజపతి రాజుకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్రతిష్టాత్మక సింహాచల దేవస్థానం చైర్మన్ పదవి నుంచి, విజయనగర సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆర్ట్స్ అండ్ సైన్స్, మాన్సాస్ ట్రస్ట్ అధ్యక్ష పదవినుంచి అశోక్ గజపతిరాజు ను తప్పించి ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతి రాజును నియమించింది ఏపీ సర్కార్. ఇక తాజాగా ధర్మకర్తగా కూడా ఆయనను తొలగించడంతో కోర్టును ఆశ్రయించారు అశోక్ గజపతిరాజు.

 కోర్టు తీర్పుపై స్పందించిన అశోక్ గజపతిరాజు .. మరోసారి రాముడికి సేవ చేసే భాగ్యం

కోర్టు తీర్పుపై స్పందించిన అశోక్ గజపతిరాజు .. మరోసారి రాముడికి సేవ చేసే భాగ్యం

కోర్టు తాజా తీర్పుతో ప్రభుత్వ కక్ష సాధింపు ఆటలు భగవంతుడి ముందు సాగవని, ఆ రాముడే తనను ఆశీర్వదించారని , ఆయన దీవెనలతోనే తాను రామ తీర్థ ఆలయ ధర్మకర్త గా సేవలందిస్తా అంటూ అశోక్ గజపతిరాజు ట్వీట్ చేశారు. మరోసారి రాముడికి సేవ చేసే భాగ్యం కలిగిందని పేర్కొన్నారు . ఈ రోజు రామతీర్ధం వద్ద స్వామి వారి విగ్రహాల పునః ప్రతిష్ఠ అని తెలిసిందని , ఈ పవిత్రమైన రోజున రాముడు తన సేవలో కొనసాగడానికి నన్ను ఆశీర్వదించాడనికోర్టు తీర్పు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు .

English summary
Another shock to Jagan government. It is learned that government orders have been issued to remove Ashok Gajapatiraju, the hereditary trustee of Rama Tirtham. The High Court today quashed the government's order dismissing Ashok Gajapatiraju as trustee. With this, it seems that Ashok Gajapathiraju got a big relief in the High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X