వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి షాక్: దివ్యవాణి రాజీనామా..మహానాడు తర్వాత ఊహించని పరిణామం; కారణం అదేనా!!

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు సక్సెస్ అయిందని తెలుగు తమ్ముళ్లు జోష్ లో ఉన్నారు. ఈ సమయంలోనే టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా పార్టీ కోసం తన వాయిస్ ను వినిపిస్తున్న దివ్యవాణి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో తన రాజీనామాకు గల కారణాన్ని వెల్లడించారు.

 వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ టీడీపీలో చురుగ్గా దివ్యవాణి ..

వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ టీడీపీలో చురుగ్గా దివ్యవాణి ..

తెలుగుదేశం పార్టీలో మంచి మాటకారిగా గుర్తింపు ఉన్న దివ్యవాణి తెలుగుదేశం పార్టీ కోసం తన స్వరాన్ని వినిపిస్తూ వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మొదలుకొని, కొడాలి నాని, రోజా వంటి వైసీపీ ఫైర్ బ్రాండ్ లను టార్గెట్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ లు ఇస్తున్నారు. తన బలమైన వాయిస్ ను పార్టీ కోసం వినిపిస్తున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలలోనూ ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. టీడీపీ మహానాడుకు ముందు నిర్వహించిన మినీ మహానాడులలోనూ ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఊహించని విధంగా పార్టీకి దివ్యవాణి రాజీనామా

ఊహించని విధంగా పార్టీకి దివ్యవాణి రాజీనామా

ఇక పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తించబడిన దివ్యవాణి ఊహించని విధంగా మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారని సమాచారం . టిడిపి అధికార ప్రతినిధి గా కొనసాగుతున్న ఆమె మంగళవారం నాడు రాజీనామా చేశారని తెలుస్తుంది. మహానాడులో జరిగిన కొన్ని ఘటనలతో మనస్తాపం చెందిన దివ్యవాణి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

దివ్యవాణి రాజీనామాకు గల కారణాన్ని వెల్లడిస్తూ తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ దివ్యవాణి వెల్లడించారు.

దివ్యవాణి ఆలోచన మార్చుకోవాలని అభిమానుల సూచన

దివ్యవాణి ఆలోచన మార్చుకోవాలని అభిమానుల సూచన


అయితే దివ్యవాణి రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని టిడిపి కార్యకర్తలు, ఆమె అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపం తోనే దివ్యవాణి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆమె భవిష్యత్తు కార్యాచరణపై ఈరోజు సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు గా సమాచారం.

మహానాడులో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని దివ్యవాణి రాజీనామా నిర్ణయం

మహానాడులో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని దివ్యవాణి రాజీనామా నిర్ణయం

అయితే మహానాడులో దివ్యవాణి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం రాజీనామా చేయడానికి కారణమా లేక దివ్యవాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నారా అన్నది ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు పార్టీలో దివ్యవాణిని ఇబ్బంది పెడుతున్న అదృశ్యశక్తులు ఎవరు? ఎవరి వల్ల దివ్యవాణి రాజీనామా చేస్తున్నారు? అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

దివ్యవాణి రాజీనామా వెనుక అసలు కారణాలు ఏంటో దివ్యవాణి మాట్లాడితే తప్ప తెలిసే అవకాశం లేదు. ఏది ఏమైనా మహానాడు సక్సెస్ అయిన జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి, టీడీపీ అధినేత చంద్రబాబుకు, లోకేష్ కు దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేయడం ఒకింత షాక్ అనే చెప్పాలి. మరి ఈ వ్యవహారంలో చంద్రబాబు ఏం చేస్తారో తెలియాల్సి ఉంది.

English summary
TDP spokesperson Divyavani has reportedly resigned, shocking the TDP. It remains to be seen what Chandrababu will do with the unexpected decision of divyavani after Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X