అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా భారతి పేరు: ఇంత దారుణమా... షాకైన జగన్

Recommended Video

    నిందితురాలిగా జగన్‌ సతీమణి భారతి పేరు

    అమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతిపై తొలిసారి అక్రమాస్తుల కేసులో అభియోగాలు నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. దీనిపై జగన్ స్పందించారు. ఈడీ ఛార్జీషీటులో జగన్ సతీమణి భారతి పేరు ఉందని వార్తలు వచ్చాయి.

    భారతీ సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తో పాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసిందని వార్తలు రావడంపై ప్రతిపక్ష నేత సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    Shocked to see the reports by select media today, where my wife was named as accused by ED: YS Jagan

    సెలెక్టెడ్ మీడియాలో ఈ రోజు వచ్చిన వార్త తనను షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు. తన భార్య పేరును ఈడీ ఛార్జీషీటులో పేర్కొందని వార్తలు వచ్చాయని, ఇది తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. కనీసం కుటుంబ సభ్యులను కూడా వదలకుండా రాజకీయాలు చేస్తూ, దిగజారుతున్నారని, ఇది చాలా బాధాకరమని వాపోయారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+