షాకింగ్ : 60 ఏళ్ల హిజ్రాపై 15 మంది గ్యాంగ్ రేప్-వైఎస్సార్ జిల్లాలో దారుణం

ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ మహిళలు, యువతులపై రేప్ లు,గ్యాంగ్ రేప్ లు మాత్రమే చూస్తున్న రాష్ట్రంలో అమానుషంగా హిజ్రాపై గ్యాంగ్ రేప్ జరిగింది. దీనికి సంబంధించి వెలుగులోకి వచ్చిన సమాచారం తీవ్ర కలకలం రేగుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

వైయస్సార్ కడప జిల్లాలో ఓ హిజ్రా (60) పై పదిహేను మంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత హిజ్రాతో పాటు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పులివెందుల పట్టణంలోని కదిరి రహదారిలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో రాత్రి ఏడు గంటల సమయంలో బాధితురాలితో పాటు మరో హిజ్రా(35)ఉన్నారు. ఈ క్రమంలో పులివెందుల నుంచి అనంతపురం జిల్లా కదిరికి రెండు కార్లలో వెళుతున్న పదిహేను మంది గుర్తు తెలియని వ్యక్తుల కన్ను వారిపై పడింది.

shocking : 60 year old transgender gang raped by 15 miscreants in ysr district of ap

కార్లలో నుంచి దిగి హిజ్రాల వద్దకు వచ్చిన ముందుగా 35 ఏళ్ల వయసున్న హిజ్రాపై అత్యాచారయత్నం చేయగా తప్పించుకుంది. అక్కడే ఉన్న మరో హిజ్రాపై వారంతా అత్యాచారం చేసి గాయపరిచారని బాధితులు తెలిపారు.

వెంటనే ఆ విష యాన్ని దిశ యాప్ లో ఫిర్యాదు చేయగా వారి ఆదేశాలతో స్థానిక పోలీసులు స్పందించారు. విషయం తెలుసుకున్న తోటి హిజ్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని అత్యా చారానికి పాల్పడిన వారిలో ఓ నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై ఎస్.ఐ. గోపినాథ్ రెడ్డిని వివరణ కోరగా హిజ్రాల ఫిర్యారు మేరకు దర్యాప్తు చేపట్టామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.విచారణలో వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+