వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఆ కేసుల్లో దేశంలో రెండో స్థానంలో ఏపీ...1.82 లక్షల మందికి ఎయిడ్స్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎయిడ్స్ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.తాజాగా జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ఇచ్చిన లెక్కలు ఏపీ, తెలంగాణా రాష్ట్రాలను వణికిస్తున్నాయి.

ఒకప్పుడు అతి భయంకరమైన వ్యాధిగా పరిగణించిన ఎయిడ్స్ వ్యాధి నిర్మాణం కోసం ఎయిడ్స్ నియంత్రణ మండలి నడుంబిగించింది. ఇప్పటివరకు ఎయిడ్స్ బారిన పడిన వారికి ఉపశమనానికి మందిని మినహాయించి, వ్యాధి పూర్తి నివారణకు మందులు కనిపెట్టలేదు. నేటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ప్రభుత్వ ఎంత ప్రచారం చేసినా, వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలని ఎన్ని రకాల సూచనలు చేసినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాపకింద నీరులా ఎయిడ్స్ ప్రబలుతోంది.

ఏడాది బాలుడికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన వైద్యులు...20 ఏళ్ల తర్వాత శిక్షఏడాది బాలుడికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన వైద్యులు...20 ఏళ్ల తర్వాత శిక్ష

Shocking .. AP second place in AIDS cases.. 1.82 lakh people victims

జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక హెచ్ఐవి పాజిటివ్ మరియు ఎయిడ్స్ రోగులు అత్యంత ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలపై సమాచారాన్ని పొందుపరిచింది. ఇందులో భారతదేశంలో ఏపి రెండవ స్థానంలో నిలువగా, తెలంగాణ రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది. హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు అత్యధికంగా కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండడం ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

డిసెంబరు 2018 నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది హెచ్ఐవీ పాజిటివ్ తో, ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్టు జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదికలో వెల్లడించింది. ఇక వీరిలో ఏకంగా 1.82 లక్షల మంది వ్యాధిగ్రస్తులు ఏపీలోనే ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఫలితంగా ఈ జాబితాలో ఏపీ రెండో స్థానంలోనూ , 78 వేల మందితో తెలంగాణ ఐదో స్థానంలో ఉండడం తెలుగు రాష్ట్రాలను షాక్ కు గురి చేస్తుంది. ఇప్పటిదాకా 3.5కోట్ల మందికి పైగా ప్రాణాలను ఎయిడ్స్ వ్యాధి బలితీసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి.

English summary
The National Health Profile Report provides information on states where HIV positive and AIDS patients are most prevalent. In India, AP stands second and Telangana is fifth. Andhra Pradesh ranks second among states with the highest number of HIV and AIDS patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X