వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కళ్యాణ్‌, లోకేష్ లకు షాక్: ఇప్పటం బాధితుల ఇళ్ళముందు ఫ్లెక్సీలు.. ఏపీలో విస్తుబోయే రాజకీయం!!

|
Google Oneindia TeluguNews

గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మంగళగిరి మండలం ఇప్పటం గ్రామం చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పటం గ్రామం లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిరుపేదలకు చెందిన ఇళ్ళు కూల్చి వేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక తాజాగా ఇప్పటం ఇళ్ల కూల్చివేత ఘటనపై మరో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఇప్పటం గ్రామంలో బాధితుల ఇళ్ళ ముందు షాకింగ్ బ్యానర్లు

ఇప్పటం గ్రామంలో బాధితుల ఇళ్ళ ముందు షాకింగ్ బ్యానర్లు


ఇప్పటం గ్రామంలో బాధితుల ఇళ్ళ ముందు షాకింగ్ బ్యానర్లు వెలుగుచూస్తున్నాయి. ఇక ఆ బ్యానర్లలో మాపై ఎవరు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా మాకు వద్దు అంటూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. డబ్బులు ఇచ్చి అబద్దాలు నిజం చేయాలని ప్రయత్నించవద్దు అని పరోక్షంగా జనసేన టిడిపి నేతలకు షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని ఇందుకు తాము సహకరిస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

వైఎస్ జగన్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిపై బ్యానర్లు

వైఎస్ జగన్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిపై బ్యానర్లు


మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 137 కోట్ల రూపాయలను కేటాయించారని అందులో కేవలం ఇప్పటం అభివృద్ధికే 6 కోట్లను ఆళ్ల రామకృష్ణారెడ్డి కేటాయించారంటూ భారీ ఫ్లెక్సీలు, లెక్కలు చూపిస్తూ ఏర్పాటు చేశారు. ఏ ఏ పనులు ఎంత నిధులు కేటాయించారు అన్న అంశాలను కూడా బ్యానర్లలో స్పష్టంగా పేర్కొని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక ఇదే సమయంలో ఇప్పటం లో తాము ఎవరి ఇల్లు కూల్చివేతకు పాల్పడలేదని, రోడ్డు విస్తరణ పనులను చేపట్టిన క్రమంలో, విస్తరణలో భాగంగా కొన్ని ప్రహరీ గోడలు మాత్రమే తొలగించామని వైసీపీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఇక తాజాగా వెలిసిన ఫ్లెక్సీలు పవన్, చంద్రబాబులకు చెంపపెట్టు అన్నారు.

వాళ్ళే ఇళ్ళు కూల్చి.. వాళ్ళే బెదిరించి.. ఇళ్ళ ముందు బ్యానర్లు కట్టారు: టీడీపీ ఆరోపణ

ఇక ఇప్పటం లో వెలసిన ఫ్లెక్సీలపైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ వేశారు. ఫ్లెక్సీలు కట్టింది పది శాతమే, మిగిలిన 90% మంది ప్రజల కోసం తాను వచ్చాను అంటూ నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్లెక్సీలు కట్టిన వారంతా వైసీపీ కార్యకర్తలు అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఏ పని చేసినా ప్రజలందరి మద్దతు తో చేయాలని లోకేష్ సూచించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ వేదికగా వైసిపిని ఈ వ్యవహారంలో టార్గెట్ చేస్తుంది. వాళ్ళే ఇళ్ళు కూల్చి.. వాళ్ళే బెదిరించి.. వాళ్ళే ప్రభుత్వం కూల్చలేదని, కూల్చిన ఇంటి ముందే బ్యానర్లు కట్టారు.. ఇంతకంటే రాజకీయ ఉన్మాదం ఉంటుందా ? రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇదే.. అంటూ టీడీపీ సోషల్ మీడియా వేదికగా ఇప్పటం వ్యవహారంపై నిప్పులు జరుగుతుంది.

ఇప్పటం ఇళ్ళ కూల్చివేత బాధితులకు అండగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్

ఇప్పటం ఇళ్ళ కూల్చివేత బాధితులకు అండగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్

ఇక ఇప్పటం లో రోడ్డు వెడల్పు పేరుతో ప్రభుత్వం కూల్చివేతలకు దిగడంతో కక్షపూరితంగానే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అంతేకాదు జనసేన ఆవిర్భావ సభకు సహకరించాలని ఇప్పటం వాసులపై కక్షగట్టి ఇళ్ల కూల్చివేతకు పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటం లో ఇళ్ల కూల్చివేత కు గురైన బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. నిన్నటికి నిన్న నారా లోకేష్ ఇప్పటి మెల్లి బాధిత కుటుంబాలను పరామర్శించి వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద పడిన గుంతలు పూడ్చలేని చెత్త ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలోఇళ్లు కూల్చేయడం వైసీపీ పెద్ద సైకో-చిన్న సైకోల పనే అంటూ మండిపడ్డారు. ఇళ్లు కోల్పోయిన బాధితుల పోరాటానికి టిడిపి అండగా ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా ఫ్లెక్సీలతో దీనిపై రాజకీయ రగడ మరింత పెరిగింది.

ఏ జగనన్న కాలనీలో తేల్చుకుందాం? పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు మంత్రి జోగి రమేష్ సవాల్!!ఏ జగనన్న కాలనీలో తేల్చుకుందాం? పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు మంత్రి జోగి రమేష్ సవాల్!!

English summary
Now shocking flexies have appeared in front of the demolished houses of the ippatam victims. The flexies also a cause of political fight between YCP, TDP and Jana Sena .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X