షాకింగ్: బాబు-లగడపాటి భేటీ వెనుక పెద్ద కారణం, అందుకే జగన్ మౌనమా?

Posted By:
Subscribe to Oneindia Telugu
  Lagadapati Rajagopal-Chandrababu meeting conspiracy బాబు-లగడపాటి భేటీ వెనుక పెద్ద కారణం| Oneindia

  అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఇటీవల రెండుసార్లు కలిశారు. దీని వెనుక పెద్ద కారణం ఉందని సాక్షి మీడియా కథనం రాసింది.

  నందమూరి హరికృష్ణలను కలిసిన సునీత, పెళ్లికి ఆహ్వానం

  అవసరం లేకపోయినా ఒప్పందాలు

  అవసరం లేకపోయినా ఒప్పందాలు

  ఓ విధంగా చంద్రబాబు, లగడపాటి కలిసి ప్రజలకు నష్టం జరిగేలా స్కెచ్ వేశారని అభిప్రాయపడింది. అవసరం లేకపోయినా ల్యాంకో, స్పెక్ట్రం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి ఏకంగా 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఒప్పందాలు (పిపిఏలు) కుదుర్చుకోనుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి నోట్ ఫైల్ ఇప్పటికే తయారయిందంటున్నారు.

  కేంద్రం చెప్పినా.. ముడుపుల అనుమానం

  కేంద్రం చెప్పినా.. ముడుపుల అనుమానం

  విద్యుత్ సమన్వయ కమిటీ ఆమోదం తర్వాత డిస్కంలు పీపీఏల తంతు ముగించే అవకాశముందని పేర్కొంది. ఈ ఒప్పందాల వల్ల రెండు ప్రయివేటు సంస్థలకు దాదాపు 32 వేల కోట్ల ప్రయోజనం చేకూరుతుందని అంచనా అని, ప్రయివేటు విద్యుత్ ప్రాజెక్టులతో దీర్ఘకాల ఒప్పందాలు చేసుకోవద్దని, ఒకవేళ చేసుకున్నా ఆ గడువు పదేళ్లకు మించకుండా ఉండాలని కేంద్ర ఇంధన శాఖ సూచించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఈ స్థాయిలో పీపీఏలకు సిద్ధమవడం భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడమే అనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొంది.

  అయినా అధిక ధరకా... విస్మయం

  అయినా అధిక ధరకా... విస్మయం

  లగడపాటి పలుమార్లు చంద్రబాబు, లోకేష్‌లను కలిశారని, ఈ నేపథ్యంలో పీపీఏకి రంగం సిద్ధం కావడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది. స్పెక్ట్రం సంస్థ పీపీఏ వెనుక ఓ మంత్రి ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. వాస్తవానికి ఇప్పుడు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని, ఇప్పటికే 10వేల మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్‌ను ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అయినప్పటికీ అధిక ధరకు విద్యుత్ కొనేలా ప్రయివేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతుండటం విస్మయం కలిగిస్తోందంటున్నారు.

  నిబంధనలకు విరుద్ధంగా..

  నిబంధనలకు విరుద్ధంగా..

  అదీ నిబంధనలకు విరుద్ధంగా 25 ఏళ్ల పాటు పీపీఏలు చేసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారని పేర్కొంది. 25 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఈ రెండు విద్యుత్ ప్లాంట్ల యంత్ర సామాగ్రి ఇప్పటికే దెబ్బతిన్నదని, ఆ యంత్ర సామాగ్రి మరో 25 ఏళ్ల పాటు ఎలా పని చేస్తాయని ఇంధన శాఖ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొంది. గడువు తీరిన ఈ ప్లాంట్ల విద్యుత్ తమకు అవసరం లేదని డిస్కంలు ఈ ఏడాది ఐపీఈఆర్సీకి సమర్పించిన ఆదాయ, అవసర నివేదికలోపేర్కొన్నాయని అంటున్నారు. అయినా ప్రభుత్వం ముందుకు పోవడం వెనుక ఏదో ఉందనే చర్చ సాగుతోందంటున్నారు.

  అలా చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు

  అలా చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు

  స్పెక్ట్రం ఉత్పత్తి సామర్థ్యం 205 మెగావాట్లు కాగా, ల్యాంకో ఉత్పత్తి సామర్థ్యం 360 మెగావాట్లు అని చెబుతున్నారు. వీటి నుంచి రోజుకు 10 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు తీసుకోవాల్సి ఉంటుందని, యూనిట్ ధరను ఏపీఈఆర్సీ నిర్ధారించాల్సి ఉంటుందని, అప్పటి వరకు యూనిట్‌కు రూ.350 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అంటే 10 మిలియన్ యూనిట్లకు రోజుకు రూ.3.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఈ లెక్కన ఏడాదికి దాదాపు రూ.1277 కోట్లు, 25 ఏళ్లకు 31,937 కోట్లకు పైగా ఈ రెండు సంస్థలకు చెల్లించాలని, కానీ బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ ధర రూ.2కే లభిస్తుందని పేర్కొంది.

  దీనస్థితిలో లగడపాటి సంస్థలు, జగన్ మౌనం!

  దీనస్థితిలో లగడపాటి సంస్థలు, జగన్ మౌనం!

  లగడపాటి రాజగోపాల్ సంస్థలు దీనస్థితిలో ఉన్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. వాటికి చంద్రబాబు లబ్ధి చేకూర్చబోతున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ అంశాన్ని విపక్షం కూడా గట్టిగా ప్రశ్నించడం లేదని, రాబోయే రోజుల్లో లగడపాటి తన వైపు వస్తాడనే ఆశతో జగన్ ఇన్నాళ్లు పెద్దగా లేవనెత్తలేదా అనే వారూ లేకపోలేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that YSR Congress Party cheif YS Jaganmohan Reddy media seeing conspiracy behind former MP Lagadapati Rajagopal and CM Chandrababu Naidu meeting.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X