షాకింగ్ .. తెలంగాణా సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఎంపీ విజయసాయి రెడ్డి

Recommended Video

    KCR కాళ్ళు మొక్కిన విజయసాయి రెడ్డి...!!! || Oneindia Telugu

    తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్న జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన జగన్ దంపతులకు సాదర స్వాగతం పలికారు కేసీఆర్. జగన్ తో పాటు విజయసాయి రెడ్డి ,రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. మానుకోటలో జగన్ ను రానివ్వకుండా రాళ్ళ దాడి చేసిన ఘటన మరచి జగన్ , కేసీఆర్ లు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే ఇక విజయసాయిరెడ్డి చేసిన పని అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

    మొదట నుండీ వైసీపీలో ఏ 2 గా చెప్పబడే విజయసాయిరెడ్డి జగన్ తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక జగన్ కేసీఆర్ ను కలిసిన సమయంలో విజయసాయి రెడ్డి , మిథున్ రెడ్డి లను కేసీఆర్ కు పరిచయం చేశారు. కేసీఆర్ విజయసాయి రెడ్డి ఎన్నికల సమయంలో చేసిన కృషిని ప్రశంసించారు. దాంతో విజయసాయి రెడ్డి కేసీఆర్ పాదాలకు మొక్కాడు. అక్కడ వున్న వారు ఎవరూ పెద్దగా స్పందించలేదు కానీ ఆ దృశ్యాన్ని టెలివిజన్ లలో చూసిన వీక్షకులు మాత్రం అవాక్కయ్యారు.

    Shocking ... MP Vijayasai reddy touched the feet of Telangana CM KCR

    వైసీపీలో కీలక నాయకుడు, సీనియర్, జగన్ తర్వాత ముఖ్య నాయకుడు, ఎంపీ ఈ విధంగా పక్క రాష్ట్ర సీఎం కాళ్ళు మొక్కటం ఆంధ్ర ప్రదేశ్ ఆత్మాభిమానాన్ని కించపరచటమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా పనులు కరెక్ట్ కాదని వారు భావిస్తున్నారు. ఇక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ భేటీలో ఖమ్మం వైసీపీ నుండి గెలిచి టీఆర్ ఎస్ కు పార్టీ ఫిరాయించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+