• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఏజెన్సీ గంజాయి సాగు, స్మగ్లింగ్ వెనుక షాకింగ్ విషయాలు; స్మగ్లర్స్ వర్సెస్ సర్కార్.. వార్ కంటిన్యూ!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీలో గంజాయిపై యుద్ధం కొనసాగుతోంది. వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని ధ్వంసం చేయడానికి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్న గంజాయిని అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రమించాల్సి వస్తుంది. ఇక విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు, దాని మూలాలు, అక్కడి గిరిజనుల పరిస్థితులు, ప్రస్తుతం గంజాయిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, స్మగ్లర్ల కొత్త ఎత్తుగడలపై వన్ ఇండియా అందించే ప్రత్యేక కథనం మీకోసం

సినీ ఫక్కీలో గంజాయి ఛేజింగ్: విశాఖ టూ మధ్యప్రదేశ్, జయశంకర్‌ జిల్లాలోనూ భారీగా గంజాయి పట్టివేతసినీ ఫక్కీలో గంజాయి ఛేజింగ్: విశాఖ టూ మధ్యప్రదేశ్, జయశంకర్‌ జిల్లాలోనూ భారీగా గంజాయి పట్టివేత

 1973లో గంజాయి అక్రమ రవాణాపై తొలి కేసు,

1973లో గంజాయి అక్రమ రవాణాపై తొలి కేసు,

1973లో విశాఖపట్నం జిల్లా పోలీసులు ఏజెన్సీ ప్రాంతం నుండి తక్కువ మొత్తంలో ఎండు గంజాయిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు డైలమాను ఎదుర్కొన్నారు. ఇది గంజాయి స్మగ్లింగ్‌లో నమోదు చేయబడిన మొట్ట మొదటి కేసు. ఆ తరువాత 1985లో నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం అమల్లోకి వచ్చినందున మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కేసులు బుక్ చేయడానికి పోలీసులకు మార్గం సుగమమైంది.

 హిమాచల్ ప్రదేశ్ చంబా లోయను మించేలా విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు

హిమాచల్ ప్రదేశ్ చంబా లోయను మించేలా విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు

అయితే విశాఖ ఏజెన్సీలో పరిస్థితులు కూడా తదనంతర కాలంలో అనూహ్యంగా మారాయి. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో తొమ్మిది మండలాలలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతోంది. రాష్ట్రానికి విశాఖ ఏజెన్సీ'గంజాయి రాజధాని'గా మారిపోయింది. విశాఖ ఏజెన్సీలో సాగు మరియు అక్రమ రవాణా హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా లోయతో పోటీ పడుతూ సాగుతుందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు .విశాఖ ఏజెన్సీలో పండించే 'శీలావతి' రకం గంజాయికి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది.

 విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగుకు దిండిగల్ మరియు ఇడుక్కిలోని స్మగ్లర్ల శిక్షణ

విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగుకు దిండిగల్ మరియు ఇడుక్కిలోని స్మగ్లర్ల శిక్షణ

విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు రాత్రికి రాత్రి జరగలేదు. ఆర్థికంగా వెనుకబడిన గిరిజన సమూహాలకు చెందిన ఆదివాసి రైతులను సాంప్రదాయ పోడు సాగు నుండి మార్చి, వారితో గంజాయిని పండించేలా ప్రేరేపించడానికి పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లర్లు కృషి చేశారంటే అతిశయోక్తి కాదు. విశాఖ ఏజెన్సీలోని గిరిజనులకు కేరళ తమిళనాడు రాష్ట్రాల నుండి గంజాయి స్మగ్లర్లు గంజాయి సాగులో శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. ఒకప్పుడు దిండిగల్ మరియు ఇడుక్కిలోని కొండ ప్రాంతాలలో గంజాయిని పెంచి, ఆ రాష్ట్రాలలోని ఎక్సైజ్ శాఖ సిబ్బందిచే తరిమికొట్టబడిన స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీ ని ఎంచుకుని విశాఖ ఏజెన్సీలోని గిరిజనులకు గంజాయి సాగుపై తర్ఫీదునిచ్చారు. వారు తరువాతి కాలంలో విశాఖ ఏజెన్సీలోని స్థిరపడి ఉండొచ్చని విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు మూలాల పై అధ్యయనం చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు

గంజాయి సాగుకు అనుకూల వాతావరణం, నేల పరిస్థితులు, మావోల ప్రోత్సాహం

గంజాయి సాగుకు అనుకూల వాతావరణం, నేల పరిస్థితులు, మావోల ప్రోత్సాహం

ఏజెన్సీలోని మొత్తం 11 మండలాలలో గంజాయి సాగుకు వాతావరణం మరియు నేల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమాయక ఆదివాసీలు అప్పటి వరకు సంపాదిస్తున్న దానికంటే కొంచెం ఎక్కువ వారికి సంపాదనను చూపించడం ద్వారా వారిని ప్రభావితం చేశారు స్మగ్లర్లు. అంతేకాదు విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు చేసేవారు నిషేధిత CPI(మావోయిస్ట్) యొక్క ప్రోత్సాహాన్ని కూడా కలిగి ఉన్నారు. ఒక మావోయిస్టుల ప్రాబల్యం 1980ల ప్రారంభం నుండి ఈ ప్రాంతంలో తన ఉనికిని చాటుకుంది.

 విశాఖ ఏజెన్సీ మండలాల్లో జోరుగా సాగు, ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్

విశాఖ ఏజెన్సీ మండలాల్లో జోరుగా సాగు, ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్


ముఖ్యంగా పెదబయలు, జి. మాడుగుల, ముంచింగ్‌పుట్‌, జికె వీధి, చింతపల్లి వంటి మండలాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మండలాల్లో 20 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసినట్లు రెండేళ్ల క్రితం డ్రోన్‌ మ్యాపింగ్‌లో తేలిందని సమాచారం. అయితే ఇటీవల డ్రగ్స్ వ్యవహారంతో ఏపీలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దేశంలోని అనేక రాష్ట్రాలలో పట్టుబడుతున్న గంజాయి విశాఖ నుండే కావటంతో మరింత ఆందోళన నెలకొంది. విపరీతంగా జరుగుతున్న గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (SEB)ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది గంజాయి పంటను నాశనం చేసే బాధ్యతను ఎస్‌ఈబీకి అప్పగించారు.

800 కేసులు, 7,124 ఎకరాల్లో పంట ధ్వంసం చేసిన ఎస్ఈబీ అధికారులు

800 కేసులు, 7,124 ఎకరాల్లో పంట ధ్వంసం చేసిన ఎస్ఈబీ అధికారులు

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీసులు రెండూ ఇప్పటివరకు దాదాపు 800 కేసులు నమోదు చేశాయి. 1,879 మంది నిందితులను అరెస్టు చేశారు. 809 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ₹61 కోట్ల విలువైన 122 టన్నుల ఎండు గంజాయిని సీజ్ చేశారు. అరెస్టులు, గంజాయి సీజ్ చేయడం ఆపరేషన్‌లో ఒక భాగం మాత్రమే అయితే, ప్రధాన ఎజెండా పంటను నాశనం చేయడం అని గుర్తించి తాజాగా ఆపరేషన్ 'పరివర్తన' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . ప్రత్యామ్నాయ పంట విధానాన్ని చేపట్టడానికి గిరిజన రైతులను ప్రేరేపిస్తూ, గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీసులు ఇప్పటివరకు దాదాపు ఎనిమిది కీలక మండలాల్లో సుమారు 7,124 ఎకరాల్లో పంటను నాశనం చేశారు. దీని విలువ రూ.1,700 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు దాదాపు 400 ఎకరాల్లో పంట గిరిజనులే స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు.

Recommended Video

Living Together Relationships Increasing ఓవైపు గంజాయి.. మరోవైపు సహజీవనాలు | Oneindia Telugu
 గంజాయి రవాణా అడ్డుకుంటున్న క్రమంలో కొత్త దారులు వెతుకుతున్న స్మగ్లర్లు .. వార్ కంటిన్యూ

గంజాయి రవాణా అడ్డుకుంటున్న క్రమంలో కొత్త దారులు వెతుకుతున్న స్మగ్లర్లు .. వార్ కంటిన్యూ

గంజాయి పై యుద్ధం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి గుప్పు మంటూనే ఉంది. తనిఖీల నుండి తప్పించుకోవడానికి, గంజాయి స్మగ్లర్లు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువెళ్లడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. వారు ఇప్పుడు ఆకులను చూర్ణం చేసి వాటిని ద్రవ గంజాయి లేదా హషీష్ నూనెగా మారుస్తున్నారు. ఒక లీటరు హషీష్ ఆయిల్ ఒక కిలో ఎండు గంజాయి విలువ కంటే 20 రెట్లు ఎక్కువ అని తెలుస్తుంది. దీనిని సులువుగా స్మగ్లింగ్ చేయవచ్చునని ఇప్పుడు లిక్విడ్ గంజాయి గా, హాషిష్ ఆయిల్ గా మారుస్తూ దందా కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న గంజాయి సాగు మరియు స్మగ్లింగ్ పై ప్రస్తుతం యుద్ధం కొనసాగుతూనే ఉంది.

English summary
The war on ganja continues in the Visakhapatnam agency. shocking things behind Visakha Agency Ganja cultivation and smuggling There is training of smugglers behind cannabis cultivation and smuggling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X