ఎమ్మెల్సీ డ్రైవర్ డెత్ మిస్టరీ: పోస్ట్ మార్టంకు నో అన్న బంధువులు; కేసులో సంచలనవిషయాలు!!
వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసు మిస్టరీ వీడలేదు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు పైనే ఈ కేసులో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన చెప్పిన విషయాలకు, పోలీసుల విచారణలో తేలిన అంశాలకు పొంతన లేకపోవటం కూడా ఎమ్మెల్సీపైన అనుమానాలకు ప్రధాన కారణంగా మారుతుంది. ఇక ఎమ్మెల్సీ ని అరెస్ట్ చేస్తేనే పోస్ట్ మార్టంకు అంగీకరిస్తామని చెప్తున్నారు బంధువులు.
ఎమ్మెల్సీ
కారులో
డెడ్
బాడీ
ఘటన..
వైసీపీ
ఎమ్మెల్సీ
అనంతబాబు
అరెస్టుకు
లోకేష్
డిమాండ్!!

అజ్ఞాతంలో ఎమ్మెల్సీ అనంత బాబు
తన కారులో డ్రైవర్ సుబ్రమణ్యం డెడ్ బాడీ ని తీసుకువచ్చి, రోడ్డు ప్రమాదంలో మరణించాడని అందుకే డెడ్ బాడీని తీసుకువచ్చామని కుటుంబ సభ్యులకు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయగా వేరే కారులో పలాయనం చిత్తగించారు. ఆపై మీడియా ముందుకు వచ్చి అన్ని మాట్లాడుతానని చెప్పిన అనంత ఉదయ్ బాబు ఇప్పటివరకు ఈ సంఘటనపై మాట్లాడింది లేదు. శుక్రవారం సాయంత్రం ఓ పెళ్లిలో కనిపించిన అనంత ఉదయ్ బాబు, ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి మాయమయ్యారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఎమ్మెల్సీ అనంతబాబుపై సంచలన ఆరోపణలు చేస్తున్న మృతుని కుటుంబం
మృతుడు
సుబ్రహ్మణ్యం
కుటుంబం
ఎమ్మెల్సీ
ఉదయ్
బాబుపై
ఆరోపణలు
గుప్పిస్తున్నారు.
గురువారం
రాత్రి
తమ
కుమారుడిని
ఎమ్మెల్సీ
అనంత
ఉదయ్
బాబు
పుట్టినరోజు
వేడుకలకు
అని
చెప్పి
తీసుకువెళ్లారని,
అర్ధరాత్రి
సమయంలో
రోడ్డు
ప్రమాదంలో
మృతి
చెందినట్లుగా
చెప్పి
ఎమ్మెల్సీ
కారులో
ఇంటికి
తీసుకు
వచ్చారని,
అనుమానంతో
అడ్డుకునే
ప్రయత్నం
చేయగా,ఆ
కారు
వదిలిపెట్టి
మరో
కారులో
ఎమ్మెల్సీ
ఉదయ్
బాబు
అక్కడ
నుంచి
వెళ్లిపోయారని
కుటుంబ
సభ్యులు
ఆరోపిస్తున్నారు.
తమ
బిడ్డను
ఎమ్మెల్సీ
పొట్టన
బెట్టుకున్నారని
తల్లి
కన్నీటిపర్యంతం
అవుతున్నారు.
భార్య
తన
భర్తను
ఎమ్మెల్సీ
అనంతబాబు
చంపేశారని
ఆరోపిస్తుంది.
ఆయనపై
కేసు
పెట్టి,
అరెస్ట్
చేయాలని,
కఠినంగా
శిక్షించాలని
మృతుని
కుటుంబం
డిమాండ్
చేస్తుంది.

రోడ్డు ప్రమాదం జరగలేదని గుర్తించిన పోలీసులు
ఇదిలా
ఉంటే
సుబ్రహ్మణ్యం
నాగమల్లి
తోట
వద్ద
రోడ్డు
ప్రమాదంలో
చనిపోయాడని
ఎమ్మెల్సీ
అనంత
బాబు
చెప్పాడని
కుటుంబ
సభ్యులు
పోలీసులకు
వివరించారు.
దీనిపై
దర్యాప్తు
చేసిన
పోలీసులు
ఎమ్మెల్సీ
అనంత
బాబు
చెప్పిన
చోట
రోడ్డు
ప్రమాదానికి
సంబంధించి
ఎటువంటి
ఆనవాళ్లు
లేవని,
యాక్సిడెంట్
కు
గురైన
బైకు
కూడా
కనిపించలేదని,
అసలు
అక్కడ
రోడ్డు
ప్రమాదం
జరగలేదని
గుర్తించినట్లుగా
తెలుస్తుంది.
ఒక
పక్క
కుటుంబ
సభ్యుల
ఆరోపణలు,
రోడ్డు
ప్రమాదం
జరగలేదని
పోలీసులు
గుర్తించడం
వెరసి
ఈ
కేసులో
ఎమ్మెల్సీ
అనంత
ఉదయ్
బాబుపై
అనుమానం
మరింత
బలపడింది.

డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీని అరెస్ట్ చెయ్యాలన్న టీడీపీ
మరోవైపు
ప్రతిపక్ష
పార్టీలు
ఎమ్మెల్సీ
అనంత
ఉదయ్
బాబును
అరెస్ట్
చేయాలని
డిమాండ్
చేస్తున్నారు.
సుబ్రమణ్యం
మృతి
హత్య
అని
స్పష్టంగా
కనబడుతున్నా
పోలీసులు
ఎందుకు
ఆయనను
అరెస్టు
చేయడం
లేదని
ప్రశ్నించారు.
తెలుగుదేశం
పార్టీ
ఎలాంటి
వాళ్లకు
ఎలాంటి
పదవులు
ఇచ్చావు
జగన్
రెడ్డీ!
అంబటి,
అవంతీ,
అనంతబాబు...
మీ
పార్టీలో
అందరూ
ఇంతేనా?
అంటూ
సోషల్
మీడియా
వేదికగా
మండిపడుతుంది.
వైసీపీ
ఎమ్మెల్సీ
అనంత
బాబు
సెల్
ఫోన్
స్విచాఫ్
చేశారని
పరారీలో
ఉన్నారని
సోషల్
మీడియా
వేదికగా
పేర్కొంది.

పోస్ట్ మార్టం నిర్వహణపైనా బంధువుల అభ్యంతరం .. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ కు డిమాండ్
ఇక
సుబ్రమణ్యం
మృతదేహానికి
పోస్టుమార్టం
నిర్వహిస్తే
అసలు
విషయాలు
వెలుగులోకి
వచ్చే
అవకాశం
ఉంది.
అయితే
బంధువులు
ఎమ్మెల్సీ
అనంత
ఉదయ్
బాబు
మార్చురీ
వద్దకు
వస్తేనే,
ఆయనను
అరెస్ట్
చేస్తేనే
పోస్టుమార్టంకి
అంగీకరిస్తామని
సంతకాలు
చేయడానికి
నిరాకరించారు.
దీంతో
పోస్టుమార్టం
నిలిచిపోయింది.
దీంతో
ఈ
కేసులో
పోలీసులు
ఏం
చేయబోతున్నారు
అన్నది
ప్రస్తుతం
రాష్ట్రవ్యాప్తంగా
ఆసక్తికర
అంశంగా
మారింది.
మొత్తానికి
ఎమ్మెల్సీ
డ్రైవర్
డెత్
మిస్టరీ
అధికార
పార్టీ
ఎమ్మెల్సీ
కి,
అధికార
పార్టీకి
ప్రస్తుతం
పెద్ద
తలనొప్పిగా
తయారైంది.