ముగ్గురు టిడిపి నేతలకు అధిష్టానం షాక్: బాబుకు వైసిపి ఎమ్మెల్యే సారీ

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ/కడప: క్రమశిక్షణారాహిత్య చర్యలకు పాల్పడిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలకు అధిష్టానం షాకిచ్చింది. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ముగ్గురు తెదేపా నేతలకు పార్టీ ఈ నోటీసులు జారీ చేసింది.

ఉయ్యూరు ఏఎంసీ ఛైర్మన్‌ వల్లభనేని సత్యనారాయణ, ఉయ్యూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ తుమ్మల శ్రీనివాస్ బాబు, ఉయ్యూరు టౌన్‌ వార్డు కమిటీ అధ్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాస్‌లకు నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా అధిష్ఠానానికి సంజాయిషీ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది.

దౌర్భాగ్యపు సీఎం, రిజైన్ చేస్తున్నా: చెప్పుతో కొట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే

వీరు పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం సంస్థాగత ఎన్నికల సమయంలో క్రమశిక్షణ రాహిత్య చర్యలకు పాల్పడి పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించారని పేర్కొంది.

Showcause notices to Three TDP leaders

అందుకే చెప్పుతో కొట్టుకున్నా

టిడిపి నేతలకు పశ్చాత్తాపం కలగాలనే నేను చెప్పుతో కొట్టుకున్నానని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఆయన ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నిక వాయిదా పడినప్పుడు చెప్పుతో కొట్టుకున్న విషయం తెలిసిందే.

దీనిపై మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అమ్ముకున్నారన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని, ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party issued showcause notices to Three Telugudesam Party krishna district leaders on Tuesday.
Please Wait while comments are loading...