వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతిలో కీచక ఎస్సై .. లాడ్జీలో ఉన్న లవర్స్ తో అసభ్యంగా .. బాధితుల ఫిర్యాదు !!

|
Google Oneindia TeluguNews

కంచే చేను మేసిన చందంగా కాపాడవలసిన పోలీసే కీచకుడిగా మారాడు.ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.లైంగిక వేధింపులకు గురిచేశాడు.ఎవరికైనా చెబితే కేసు నమోదు చేస్తాను అంటూ బెదిరించాడు.ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాల్లోకి వెళితే..

వ్యభిచారంలో పోటీనే హత్యకు కారణం ? ఆమె అందమే శాపం .. దివ్య హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్ లువ్యభిచారంలో పోటీనే హత్యకు కారణం ? ఆమె అందమే శాపం .. దివ్య హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్ లు

అమరావతి లాడ్జీలో ఉన్న జంటను బెదిరించిన ఎస్సై ..డబ్బులు డిమాండ్

అమరావతి లాడ్జీలో ఉన్న జంటను బెదిరించిన ఎస్సై ..డబ్బులు డిమాండ్

పెదకూరపాడు మండలానికి చెందిన ఒక లవర్స్ జంట ఏకాంతంగా గడపడానికి అమరావతిలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఉన్నారు. అయితే అదే లాడ్జికి విశ్రాంతి తీసుకునే నెపంతో వచ్చిన స్థానిక ఎస్సై రామాంజనేయులు వారిని గమనించి కేసు నమోదు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.ఎస్సై తన వ్యక్తిగత వాహనంలో వచ్చి ఆ జంటను బెదిరించారు. ఎలాంటి కేసులు లేకుండా వదిలి పెట్టాలంటే పదివేల రూపాయలు ఇవ్వాలని లంచం డిమాండ్ చేశాడు. దీంతో వారు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి తమ వద్ద ఉన్న మూడు వేల రూపాయలు ఇచ్చి,మరో 2 వేల రూపాయల కోసం లాడ్జిలో మహిళ తో కలిసి బస చేసిన సదరు వ్యక్తి ఎస్సై డ్రైవర్ తో కలిసి బయటకు వెళ్ళాడు.

డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్లి వచ్చే లోపు మహిళతో అసభ్య ప్రవర్తన

డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్లి వచ్చే లోపు మహిళతో అసభ్య ప్రవర్తన

అక్కడ సమీపంలో ఉన్న ఏటీఎం సెంటర్ నుండి డబ్బులు డ్రా చేసి తిరిగి రూమ్ కి వచ్చి ఎస్ఐకి డబ్బులు ఇచ్చారు. ఇక ఈలోగా సదరు మహిళ దగ్గరే ఉన్న ఎస్ఐ ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.డబ్బుల కోసం బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి గదికి చేరుకునే వరకు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు.నోటికొచ్చినట్టు మాట్లాడారు.ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇక మహిళ తిరగబడడంతో ఆమెను వదిలి పెట్టాడు.ఎవరికైనా విషయాన్ని చెబితే కేసు నమోదు చేస్తాను మీ బతుకు బస్టాండ్ అవుతుంది అంటూ బెదిరించాడు.

ఎస్సై లైంగిక వేధింపులపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు

ఎస్సై లైంగిక వేధింపులపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు

ఇక వారి వివరాలు తీసుకొని మరీ వారిని విడిచి పెట్టాడు.ఎస్ఐ రామాంజనేయులు తీరు భరించలేని మహిళ సదరు ఎస్సైపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేశారు.బాధితుల ఫిర్యాదుతో విచారణ మొదలు పెట్టిన అధికారులు ఎస్సై రామాంజనేయులు తో పాటు అతనికి సహకరించిన డ్రైవర్ పై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఎస్సై పై అందిన ఫిర్యాదు మేరకు గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావుకు జరిగిన సంఘటన వివరించారు. ఎస్సై పై విచారణ జరిపి నివేదిక ఇవ్వమని ఎస్పీ ఆదేశించినట్లు డిఎస్పీ చెప్పారు.

 రక్షకుడే కీచకుడైతే కాపాడే వారెవరు అని ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు

రక్షకుడే కీచకుడైతే కాపాడే వారెవరు అని ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు

ఏకాంతంగా గడపాలని వచ్చిన జంటను వ్యభిచారం కేసు బుక్ చేస్తానని బెదిరించి, సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ఐ తీరు ప్రస్తుతం అమరావతి లో చర్చనీయాంశంగా మారింది. రక్షకుడే కీచకుడిగా మారితే కాపాడే వారు ఎవరూ అంటూ స్థానికప్రజలు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అంతర్గత విచారణ నిర్వహిస్తున్న పోలీసులు ఎస్సైపై చర్యలకు సిద్ధం అవుతున్నారు .

English summary
Amaravati SI ramanjaneyulu sexual harassment on a woman who stayed in a lodge with her lover . SI demanded money and also misbehaved withthe woman .She complained to the higher officials .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X