హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గురుద్వారా: దాడిపై క్యాండిల్ లైట్ నిరసన (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయనగరంలో గురుద్వారాపై దాడి జరగడాన్ని సిక్కులు నిరసించారు. దాడిని నిరసిస్తూ సోమవారం రాత్రి కొవ్వత్తులు వెలిగించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విజయనగరంలో గురుద్వారాపై రెండు రోజుల క్రితం దాడి జరిగింది. దాడికి పాల్పడిన దుండగులను శిక్షించాలని సిక్కులు డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో గురుద్వార్ సాహెబ్ బరంబాల ఆధ్వర్యంలో సిక్ చావునీ నుంచి కిషన్‌బాగ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో తమకు భద్రత కరువైందని ఆరోపిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. సిక్కులు ఇరుప్రాంతాల మనోభావాలను గౌరవిస్తారని, అయితే గురుద్వారాలపై డాడులకు పాల్పడితే సహించరని హెచ్చరించారు.

తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ నేతృత్వంలో సిక్కులు గన్‌పార్క్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సిక్కులకు సంఘీభావం తెలిపారు. గురుద్వారాపై దాడికి తమ ఉద్యోగులకు సంబంధంలేదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అశోక్ బాబును గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు రానీయటమేంటని తెలంగాణవాదులు నిలదీశారు.

సిక్కులు 1

సిక్కులు 1

విజయనగరంలోని గురుద్వారపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజధాని హైదరాబాదులోని సిక్కులు సోమవారం రాత్రి నిరసన తెలిపారు.

సిక్కులు 2

సిక్కులు 2

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో తమకు భద్రత కరువైందని ఆరోపిస్తూ సిక్కులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

సచివాలయం 1

సచివాలయం 1

రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు.

సచివాలయం 2

సచివాలయం 2

రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నిరసన తెలుపుతున్న సీమాంధ్ర ఉద్యోగులు.

సచివాలయం 3

సచివాలయం 3

రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దంటూ నినాదాలు చేశారు.

సచివాలయం 4

సచివాలయం 4

రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ హైదరాబాదులో కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నిరసన తెలుపుతున్న సీమాంధ్ర ఉద్యోగులు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామనే ప్రకటన వచ్చే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ జెఏసి

తెలంగాణ జెఏసి

తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు రఘు 48 గంటల దీక్ష చేపట్టారు. సీమాంధ్ర సమ్మెపై యాక్షన్ తీసుకోవాలని ఆయన ఈ దీక్ష చేపట్టారు.

సచివాలయం 5

సచివాలయం 5

సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నాయకుడు శ్రీనివాస్ గౌడ్, తదితరులు.

సచివాలయం 6

సచివాలయం 6

సచివాలయంలో ఎపిఎన్జీవోలతో కలిసి ఆ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. వారు విభజన నిర్ణయంపై సమ్మె చేస్తున్నారు. తమకు అనుకూలంగా ప్రకటన వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు.

సచివాలయం 7

సచివాలయం 7

సచివాలయం నుండి బయటకు వస్తున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు. ఎపిఎన్జీవోలు విభజనను నిరసిస్తూ సమ్మె చేస్తున్నారు. తమకు అనుకూలంగా ప్రకటన వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు.

English summary
Sikhs protest in Hyderabad for attack on Gurudwara in Vijayanagaram.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X