వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శిల్పా' రాజీనామా ఆమోదం, టిడిపికి దెబ్బేనా?

టిడిపి నుండి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన రాజీనామా ఆమోదం పొందింది. పది రోజుల్లోనే ఆయన రాజీనామా ఆమోదించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: టిడిపి నుండి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన రాజీనామా ఆమోదం పొందింది. పది రోజుల్లోనే ఆయన రాజీనామా ఆమోదించారు. అయితే వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై వైసీపీ ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగంచే అవకాశం లేకపోలేదు. రాజకీయాల్లో నైతికవిలువల గురించి ప్రస్తావించే చంద్రబాబుపై 'శిల్పా' రాజీనామా ఆమోదం అంశాన్ని తీసుకొని వైసీపీ ఇరుకునపెట్టే అవకాశాలు లేకపోలేదు.

రంగంలోకి ఆదిశేషగిరిరావు: 'శిల్పా'కు మహేష్‌బాబు అభిమానుల మద్దతు, 'పవన్' మద్దతెవరికీ?రంగంలోకి ఆదిశేషగిరిరావు: 'శిల్పా'కు మహేష్‌బాబు అభిమానుల మద్దతు, 'పవన్' మద్దతెవరికీ?

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే టిడిపి తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరే సమయంలోనే రాజీనామాను సమర్పించారు.

'మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే''మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే'

ఈ నెల 3వ, తేదిన నంద్యాలలో జరిగిన బహిరంగసభలో చక్రపాణిరెడ్డి తన రాజీనామా పత్రాన్ని జగన్‌కు అందించారు. నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అంతేకాదు వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు కూడ రాజీనామాలు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

సెంటిమెంట్ పునరావృతమౌతోందా, చరిత్ర తిరగరాస్తారా, నంద్యాల తీర్పు ఎలా ఉంటుంది?సెంటిమెంట్ పునరావృతమౌతోందా, చరిత్ర తిరగరాస్తారా, నంద్యాల తీర్పు ఎలా ఉంటుంది?

శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందడంతో వైసీపీ ఈ అంశాన్ని రాజకీయంగా టిడిపిని ఇబ్బందిపెట్టేందుకు ఉపయోగించుకొనే అవకాశం కన్పిస్తోంది.

శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం

శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం

ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన రాజీనామా ఆమోదం పొందింది. నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయాలని వైసీపీ చేసిన సూచనతో చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం పొందడంతో టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడి వచ్చే అవకాశం లేకపోలేదు. రాజకీయంగా ఈ వ్యవహరం టిడిపికి ఇబ్బంది. నంద్యాల ఉప ఎన్నికలో మంత్రి అఖిలప్రియను వైసీపీ నేతలు ఈ ప్రశ్నలు సంధించే అవకాశం లేకపోలేదు.

Recommended Video

Nandyal By-Poll : A Big War Between Akhila Priya And Silpa Mohan Reddy
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం స్పీకర్ పరిధిలోనే

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం స్పీకర్ పరిధిలోనే

వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ అంశం స్పీకర్ పరిధిలో ఉన్నందున స్పీకర్‌ను కోర్టులు కూడ ఆదేశించే అవకాశాలు లేవు.అయితే ఈ విషయమై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకొంటారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

తెలంగాణలో టిడిపి ఇలా..

తెలంగాణలో టిడిపి ఇలా..

తెలంగాణ రాష్ట్రంలో టిడిపి నుండి టిఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది టిడిపి. అంతే కాదు కోర్టును కూడ ఆశ్రయించింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయపరంగా ఉన్న అన్ని రకాల అంశాలను వాడుకొంటుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించే విధానం రాజకీయంగా ఆ పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి ఏపీలో కూడ ఇదే తరహ ఘటనలు

ఉమ్మడి ఏపీలో కూడ ఇదే తరహ ఘటనలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఇదే తరహ ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఆ సమయంలో టిడిపి, కాంగ్రెస్‌ల నుండి టిఆర్ఎస్, వైసీపీలలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. అయితే సుదీర్ఘ విచారణ పేరుతో ఎమ్మెల్యేల పదవికాలం ముగిసే సమయానికి వీటిపై చర్యలు తీసుకొన్నారు. ఆ సమయంలో కూడ కోర్టులను ఆశ్రయించిన ఘటనలు కూడ చోటుచేసుకొన్నాయి. ఈ తరహ కేసుల్లో సుదీర్ఘంగా విచారణ పేరుతో జాప్యం చేయడం వల్ల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రయోజనం కల్గించే అవకాశం ఉంటుంది. అయితే స్పీకర్ తనకున్న విచక్షణ అధికారాన్ని ప్రశ్నించలేమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. సాంకేతిక అంశాలు కొన్ని పార్టీలకు కలిసివస్తే, మరికొన్ని పార్టీలకు నష్టం కల్గించేవిగా ఉన్నాయి.

English summary
YSRCP leader Silpa Chakrapani reddy resignation approved Assembly secretary.Silpa Chakrapani reddy resigned MLC post on Aug 3.He joined in Ysrcp from Tdp Two weeks back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X