టిడిపికి చక్రపాణి రెడ్డి హెచ్చరిక, శిల్పా సమక్షంలో వైసిపిలోకి 200 కుటుంబాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైసిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని శిల్పా చక్రపాణి రెడ్డి హెచ్చరించారు. శిల్పా కుటుంబం ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఇక ముందు చేయదన్నారు.

'మాయాలేడీ రోజాతో జగన్ పోటీ, అఖిలప్రియపై జగన్‌కు పగ ఎందుకు'

వైసిపిలోకి 200 కుటుంబాలు

వైసిపిలోకి 200 కుటుంబాలు

సీఎం చంద్రబాబు కుట్రలు నంద్యాలలో సాగవని చెప్పారు. నంద్యాల ప్రజలు కుయుక్తులు, ప్రలోభాలకు లొంగరని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. కాగా, శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో 200 కుటుంబాలు వైసిపిలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Nandyal By-Poll : A Big War Between Akhila Priya And Silpa Mohan Reddy
టిడిపికి ఓటమి భయం

టిడిపికి ఓటమి భయం

టిడిపికి నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని వైసిపి అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం వేరుగా అన్నారు. అందుకే నంద్యాలలో గెలుపు కోసం ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి, అరాచకాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

టిడిపి నగదు పంపిణీకి పోలీసుల కాపలా

టిడిపి నగదు పంపిణీకి పోలీసుల కాపలా

నంద్యాలలో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను పక్కన పెడుతున్నారని తమ్మినేని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి నగదు పంపిణీకి పోలీసులు కాపలా కాస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు గాలిని కూడా అమ్మేవారు

చంద్రబాబు గాలిని కూడా అమ్మేవారు

మంత్రులు, ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులు నంద్యాలలో తిష్టవేసి పోలీస్ పహారాలో డబ్బులు, మద్యం ఏరులై పారిస్తున్నారని తమ్మినేని ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే శిలాఫలకాలు లేకుండా టెంకాయలు కొడుతున్నారన్నారు. చంద్రబాబుకు గాలి చిక్కడం లేదని, లేకుంటే దానిని కూడా లీటర్ కొద్ది ప్యాకెట్లు కట్టి అమ్మేవారని ఎద్దేవా చేశారు. నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని తమ్మినేని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party leader Silpa Chakrapani Reddy on Wednesday warned Telugu Desam Party leaders over cases on YSR Congress party activists.
Please Wait while comments are loading...