వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

23 మాసాలుగా యాగం..జ‌గ‌న్ కు సీఎం యోగం : చండీయాగం..పూజ‌ల్లో ముఖ్య‌మంత్రి..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరుతూ ఏకంగా 23 నెల‌లుగా యాగాలు నిర్వ‌హించారు ఓ అభిమాని. తొలుత హైద‌రాబాద్‌లో ఈ యాగం నిర్వ‌హించారు. అధికారం ద‌క్క‌టం కోసం ..జ‌గ‌న్‌కు ముఖ్య‌మంత్రి యోగం ద‌క్కాల‌ని ఈ యాగం నిర్వ‌హించారు ఓ వైద్యుడు. వైసీపీ నేత భూమన క‌రుణాక‌ర రెడ్డి ఈ యాగాన్ని తొలుత ప‌ర్య‌వేక్షించారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌టంతో నేత‌లు అందుబాటులో లేక‌పోయినా యాగం కొన‌సాగింది. దీనికి ముగింపు కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ పాల్గొన్నారు. పూర్ణాహుతి నిర్వ‌హించారు.

Recommended Video

చంద్రబాబు హయాంలో అన్ని ఇలానే ఉంటాయి

జ‌గ‌న్ కు సీఎం యోగం కోసం యాగం..
వైసీపీ అధినేత..నాటి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆశిస్తూ అభిమాని అయిన ఓ వైద్యుడు 23 నెల‌లుగా యాగం నిర్వ‌హించారు. హైద‌రాబాద్‌లో ఉండే డాక్ట‌ర్ అరిమండ వ‌ర‌ప్ర‌సాద్ 23 నెల‌లుగా నిర్విరామంగా మ‌హారుద్ర స‌హిత ద్విసహ‌స్ర చండీయాగం..దీక్షాంత పూర్ణాహుతి నిర్వ‌హిస్తున్నారు. 23 నెల‌ల క్రితం హైద‌రాబాద్‌లోని నాగోల్ లో తా యాగం ప్రారంభ‌మైంది. వైసీపీ నేత‌లు భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి..చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డిలు తొలి రోజుల్లో పూజ‌ల్లో పాల్గొన్నారు. ఆ త‌రువాత కూడా నేత‌లు ఎవ‌రూ లేక‌పోయినా డాక్ట‌ర్ వ‌ర‌ప్ర‌సాద్ కార్యక్ర‌మాన్ని కొన‌సాగించారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయి నెల రోజులు పూర్త‌యినా..ఈ రోజు వ‌ర‌కు ఈ యాగం కొన‌సాగింది. మొత్తం 23 నెల‌ల పాటు దీనిని నిర్వ‌హించాల్సి ఉండ‌టంతో కొన‌సాగించిన‌ట్లు నిర్వాహ‌కులు చెబుతున్నారు. దీంతో..ముగింపులో భాగంగా నిర్వ‌హించిన పూర్ణాహుతిలో ముఖ్య‌మంత్రి హోదాలో పాల్గొనాల‌ని వారు జ‌గ‌న్‌ను ఆహ్వానించారు.

since 23 months Doctor Hari Prasad conducting Yagam for Jagan to become CM. In concluded Pooja Jagan attended

since 23 months Doctor Hari Prasad conducting Yagam for Jagan to become CM. In concluded Pooja Jagan attended

జ‌గ‌న్ హాజ‌రు..పూర్ణాహుతి
23 నెల‌లుగా కొన‌సాగుతున్న యాగం పూర్ణాహుతితో సంపూర్ణ‌మైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆయన చేతుల మీదుగా పూర్ణాహుతి జరిగింది. ఈ సందర్భంగా పండితులు సీఎం జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి పండితులకు శాలువా కప్పి, కంకణం తొడిగి సత్కరించారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయదుందుభి మోగించాలని, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 2017 జూలై 29 నుంచి 2019 జూన్‌ 29 వరకు ఈ చండీయాగాన్ని నిర్వ‌హించ‌టాన్ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి సైతం అభినందించారు. అయితే, తాము రాజకీయంగా వారు ఎటువంటి ప్ర‌యోజ‌నాలు ఆశించ‌కుండా కేవ‌లం జ‌గ‌న్ కోస‌మే ఈ యాగం నిర్వ‌హించార‌ని మంత్రులు అభినందన‌లు తెలిపారు.

English summary
CM Jagan participated in Purnahuthi pooja in Tadepalli. since 23 months Doctor Hari Prasad conducting Yagam for Jagan to become CM. In concluded Pooja Jagan attended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X