ఆ యువ‌తి ఆఖ‌రి కోరిక‌..జ‌గ‌న‌న్న‌ను ఒక్కసారి క‌ల‌వాలి: ఆయ‌న మాత్ర‌మే: త‌ల‌సేమియాతో పోరాటం..!

ఆ యువ‌తి దీన గాధ చూస్తూ ఎవ‌రైనా చ‌లించాల్సిందే. అంద‌రి లాగా ఆడుతూ పాడుతూ చ‌దువుకోవాల్సిన స‌మ‌యం లో ప్రాణాంత‌క వ్యాధితో బాద ప‌డుతోంది. శ‌క్తికి మించి ఖ‌ర్చు చేసినా ఫ‌లితం రాలేదు. 19 ఏళ్ల వ‌య‌సులో ఆ యువ‌తి జిల్లా క‌లెక్ట‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. త‌న ఆఖ‌రి కోరిక అంటూ నివేదించింది. ఒక్క సారి జ‌గ‌న‌న్న‌ను క‌లిసే అవ‌కాశం ఇవ్వండి. ఆయ‌న మాత్ర‌మే నా ప్రాణం కాపాడ‌తాడు అంటూ బ్యాన‌ర్ చేత ప‌ట్టుకొని క‌లెక్ట‌ర్‌ను క‌లిసి క‌న్నీటి ప‌ర్యంతం అయింది. ఆ బాధ విన్న క‌లెక్ట‌ర్ సైతం క‌రిగిపోయా రు. వెంట‌నే త‌న ప‌రిధిలో ఉన్నంత వ‌ర‌కూ సాయం ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రిని కలిసే అంశం పైన ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి స‌మాచారం ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.

Recommended Video

    పురుగు మందుల పిచికారీ చేయడం పై ప్రదర్శన
     జ‌గ‌న‌న్న‌కు చెప్పండి..అదే నా ఆఖ‌రి కోరిక‌

    జ‌గ‌న‌న్న‌కు చెప్పండి..అదే నా ఆఖ‌రి కోరిక‌

    తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురానికి చెందిన సీహెచ్ సింధు వ‌య‌సు 19 ఏళ్లు. సికెల్ సెల్ (త‌ల‌సేమియా) వ్యాధితో బాధ ప‌డుతోంది. ఏడ‌వ ఏట నుండి ఈ జ‌బ్బు బారిన ప‌డింది. దాదాపు 12 ఏళ్లుగా అనేక ప్రాంతాల్లో 14 ఆస్ప‌త్రుల‌ను తిరిగి చికిత్స తీసుకుంది. అయినా న‌యం కాలేదు. త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సిందు జిల్లా క‌లెక్ట‌ర్ నిర్వ‌హించే స్పంద‌న కార్య‌క్ర‌మానికి వ‌చ్చింది. జిల్లా క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి వ‌ద్ద‌కు వ‌చ్చి త‌న స‌మస్య వివ‌రించింది. జగనన్న నా ప్రాణం కాపాడతాడు. నాకు వచ్చిన సివిల్‌ సెల్‌ వ్యాధి నయంకాలేదు. నా చివరి శ్వాస, ఆఖరి కోరిక ఒక్కటే జగనన్నకు నా సమస్య వివరించాలి..' అంటూ బ్యానర్ చేత పట్టింది. క‌లెక్ట‌ర్ సైతం చ‌లించారు. వ్యాధి వివ‌రాలు..చికిత్స పొందిన విధానం అడిగి తెలుసుకున్నారు. క‌లెక్ట‌ర్ వెంట‌నే స్పందించి ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీని ఆదేశిస్తూ తక్షణం నూరుశాతం అంగవైకల్యం ఉన్నట్లుగా ధ్రువీకరించి రూ. 60వేలు రుణం ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు.

    ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌గ‌ల‌దా...

    ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌గ‌ల‌దా...

    ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిసి త‌న స‌మ‌స్య చెప్పుకుంటానని..అదే త‌న ఆఖరి కోరిక అంటూ సింధు దీనంగా అడిగిన తీరు క‌లెక్ట‌ర్‌నే కాదు..అక్క‌డ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రినీ క‌దిలించింది. సింధు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్ర‌యాణం చేయ‌లేద ని చెబుతున్నారు. దీంతో..క‌లెక్ట‌ర్ సింధు విజ్ఞ‌ప్తిని ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి నివేదిస్తామ‌ని హామీ ఇచ్చారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయిస్తే తాను బ‌తుకుతాన‌నే న‌మ్మ‌కం సింధులో క‌నిపించింది. అయితే, ముఖ్య‌మంత్రి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తే తాము ఖ‌చ్చితంగా ముఖ్య‌మంత్రితో క‌లిసే ఏర్పాటు చేయిస్తామ‌ని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని ఎలాగైనా ముఖ్య‌మంత్రికి తెలియ‌చేయాల‌ని సింధు అభ్య‌రిస్తోంది. మ‌రి ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు అధికారులు ఎంత వ‌ర‌కు నిబ‌ద్ద‌తో తీసుకెళ్తారో అనే అనుమానం సింధు కుటుంబ స‌భ్యుల్లో క‌నిపిస్తోంది.

    గ‌తంలో విశాఖ‌లో సైతం ఇలాగే..

    గ‌తంలో విశాఖ‌లో సైతం ఇలాగే..

    గ‌తంలో ముఖ్య‌మంత్రి అయిన కొత్త‌లో జ‌గ‌న్ విశాఖ లో స్వ‌రూపానంద‌ను ద‌ర్శించుకోవ‌టానికి వెళ్లారు. తిరిగి విమానాశ్ర‌యానికి వ‌స్తున్న స‌మ‌యంలో కొంద‌రు యువ‌త త‌మ స్నేహితుడిని బ‌తికించండి అంటూ బ్యాన‌ర్ ప‌ట్టుకొని క‌నిపించారు. వెంట‌నే సీఎం వారి వ‌ద్ద‌కు వెళ్లి స‌మ‌స్య‌ను తెలుసుకున్నారు. త‌మ స్నేహితుడు బ్ల‌క్ కేన్స‌ర్‌తో పోరాటం చేస్తున్నాడ‌ని..చికిత్స కోసం 25 ల‌క్ష‌లు కావాల‌ని కోరారు. వెంట‌నే సీఎం జిల్లా క‌లెక్ట‌ర్ అవ‌స‌ర‌మైన వైద్యం అందించా లని ఆదేశించారు. అయితే, చికిత్స పొందుతూ ఆ వ్య‌క్తి కొద్ది రోజుల క్రితం మ‌ర‌ణించాడు. అయితే అత‌ని కుటుంబ స‌భ్యులు మాత్రం ముఖ్య‌మంత్రి సాయంతోనే ఇంత వ‌ర‌కు చికిత్స చేయించ‌గ‌లిగామ‌ని చెప్పుకొచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+