జూన్ నాటికి రాజధాని డిజైన్, సింగపూర్ ఫ్రీగా: మంత్రి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి జూన్ నాటికి డిజైన్ పూర్తవుతుందని మంత్రి నారాయణ శనివారం చెప్పారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ సంస్థలు ఉచితంగా డిజైన్ చేసి ఇస్తున్నాయన్నారు. మూడు దశల్లో డిజైన్ ప్రక్రియ జరుగుతుందన్నారు.
మొత్తం 7600 ఎకరాలకు డిజైన్ చేయాల్సి ఉందన్నారు. తొలుత అసెంబ్లీ, సెక్రటేరియేట్ ఉన్న ప్రాంతాలకు, ఆ తరువాత రాజధాని నగరానికి, చివరి దశలో మొత్తం సిఆర్‌డిఏకి డిజైన్ చేయాల్సి ఉంటుందన్నారు. జూన్ నాటికి డిజైన్ పూర్తవుతుందన్నారు. మే 15 నాటికి పంట భూముల్లో కోతలు కూడా పూర్తవుతాయన్నారు.

ఆ భూములను స్వాధీనం చేసుకుని దున్నించి చదును చేయిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి 37 వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించామన్నారు. అందులో 2200 ఎకరాలు గ్రామకంఠం భూములు, 33,800 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని చెప్పారు. మిగిలినవి అటవీ భూములన్నారు.












Click it and Unblock the Notifications