నేటి నుంచే SIR, అలక్ష్యం వహిస్తే ఓటు గల్లంతే - ఇలా చేయండి..!!

SIR (ఓటరు జాబితా సవరణ కార్యక్రమం) రాష్ట్రంలో ప్రారంభమయ్యింది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్‌లెవల్‌ అధికారులు(బీఎల్‌వోలు) సోమవారం నుంచి ఇంటింటి సర్వేకు రానున్నారు. ఈ సర్వే ద్వారా మరణాలు, డూప్లికేట్‌ ఓట్లు, వలసలు, అక్రమంగా చేరిన పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ సమయంలో ప్రతీ ఓటరు అలర్ట్ కావాలని సూచిస్తున్నారు. అలక్ష్యం చేస్తే ఓటు గల్లంతు అవుతుంది. తమ ఓటు కోసం ఏం చేయాలో అధికారులు సూచనలు చేస్తున్నారు.

ఏపీ వ్యాప్తంగా ఈ రోజు నుంచి సర్ ప్రక్రియ మొదలైంది. బీఎల్ ఓలు ప్రతీ ఇంటికీ ఓటర్ల సర్వే కు రానున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన సర్‌పై అపోహలు నెలకొన్నాయి. దీంతో ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఎంతో అప్రమత్తంగా, ఇంటింటి సర్వేలో ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియను చేయాల్సిన ఉంది. ఓటర్లు కూడా తమ ఓటుహక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ.. బీఎల్‌వోలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యుమరేషన్‌ ఫారాలు పూర్తిచేసి అప్పగించాల్సి ఉంది. బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి వీరి వివరాలు సేకరిస్తారు. ఇందు కోసం 46,397 మంది బీఎల్‌వోలను నియమించారు. రాజకీయ పార్టీల తరపున నియమితుల య్యే 68,868 మంది బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కూడా పాల్గొంటారు. ఇంటింటి సర్వేలో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటికీ మూడుసార్లు వస్తారు. ప్రతి ఓటరుకూ రెండు ఎన్యూమరేషన్‌ ఫారంలు ఇస్తారు. వాటిల్లో ఓటరు పేరు, ఫొటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామాతోపాటు ఓటరు పాత ఫొటో ముద్రించి ఉంటాయి. మిగిలిన వివరాలు ఓటర్లు నమోదు చేయాలి.

బీజేపీ మేజిక్ తో మారుతున్ననెంబర్ గేమ్, మిత్రపక్షాలు అలర్ట్..!!
బీజేపీ మేజిక్ తో మారుతున్ననెంబర్ గేమ్, మిత్రపక్షాలు అలర్ట్..!!
sir-special-intensive-revision-of-electoral-rolls-begins-across-andhra-pradesh-with-door-to-door-vo

ఓటర్లు ఇలా చేయటం ద్వారా

పూర్తిచేసిన ఫారంలను బీఎల్వోలు ఇంటికి వచ్చి తీసుకుంటారు. సర్‌లో 2002నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాకు లింక్‌ చేస్తున్నారు. 2002 జాబితాలోను, ప్రస్తుత జాబితాలో కూడా మీ పేరు ఉంటే... అందులోని మీ ఓటరు ఐడీ నంబరు, ఇతర వివరాలను ఫారంలో నింపాలి. అందులో మీ పేరు లేకుండా, ప్రస్తుత జాబితాలోనే ఉంటే తల్లిదండ్రులు, భార్య, భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఎవరి ఉంటే వారి వివరాలను ఫారంలో నమోదు చేయాలి. వీటితోపాటు మీ పుట్టిన తేదీ, తల్లి పేరు, భార్య, భర్త పేరు, వారి వివరాలు, ఎపిక్‌ నంబర్‌ నింపి, కొత్త కలర్‌ ఫొటో అతికించి బీఎల్‌వోకు ఇవ్వాలి. పూర్తి చేసిన ఫారంలను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు. ఓటరు ఇంటివద్ద లేకుండా, వేరే ప్రాంతంలో ఉంటే, ఆ ఓటరు ఎన్యూమరేషన్‌ ఫారాన్ని కుటుంబసభ్యులు పూర్తిచేసి ఇవ్వొచ్చు. బీఎల్వోలకు ఫారం అందజేసిన వారి పేర్లు జూలై 21న ప్రచురించే ముసాయిదా జాబితాలో ఉంటాయి. ఈ జాబితాపై జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకూ క్లైయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని సెప్టెంబరు 18 వరకు పరిష్కరిస్తారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోడానికి ఫారం 6, చిరునామాలో మార్పులకు ఫారం 8, మృతులు, అనర్హుల పేర్లు తొలగింపునకు ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని సెప్టెంబరు 18 వరకూ పరిశీలించి, సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+