వివేకా కేసులో ఐదేళ్లలో 5గురు సాక్షుల మృతి-పోలీసుల షాక్-దర్యాప్తుకు సిట్..!
ఆరేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఏపీలో పెను సంచలనం రేపగా.. ఇప్పుడు ఆయన కేసులో సాక్షులుగా ఉన్న ఐదుగురు గత ఐదేళ్లలో అనుమానాస్పదంగా చనిపోవడం మరో సంచలనం రేపుతోంది. ఇలా సాక్షులు వరుసగా చనిపోతుండటంపై పోలీసులే షాకవుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులోని సాక్షుల మరణాలు విస్తుగొలుపుతున్నాయని వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మరణాలపై దర్యాప్తుకు సెట్ ఏర్పాటు చేశారు.
తాజాగా వివేకా హత్య కేసులో ఆయన ఇంటికి గతంలో వాచ్ మెన్ గా ఉన్న రంగన్న చనిపోయాడు. అయితే ముందు ఇది సాధారణ మరణంగానే భావించినా..ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు మార్చి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అంతకు ముందు ఇదే కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ వేర్వేరు కారణాలతో చనిపోయారు. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షుల మరణాలపై స్పందించిన వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్..వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాఫ్తు చేస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని, సాక్షులు ఏయే కారణాలతో, ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. వారికి ఏమైనా ఆనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేక ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాఫ్తు జరుగుతోందన్నారు. సమగ్ర విచారణ కోసం డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
సాక్షులు చనిపోయినప్పుడల్లా సీబీఐ వల్లే వారు చనిపోయారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. అలాంటి ప్రచారాన్ని ఎందుకు, ఎవరు చేస్తున్నారనే కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వాచ్‌మన్ రంగన్న బుధవారం సాయంత్రం మృతి చెందాడని, రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అతని భార్య ఫిర్యాదు చేశారని ఎస్పీ వెల్లడించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతి చెందిన సాక్షులకు సంబంధించిన కేసులన్నింటిని దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications