కాకినాడ పోర్టు "పుష్ప" చిక్కినట్లే - కీలక ఆధారాలు..!!
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో కాలంగా ఇక్కడ జరుగుతున్న బియ్యం రవాణా వెనుక ముఖ్యుల ప్రమేయం పైన ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ మొత్తం వ్యవహారం పై విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా సిట్ విచారణ కొనసాగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారులు ఎవరో ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
కేసులు నమోదు
కాకినాడ పోర్టు నుంచి అయిదేళ్లు కాలంలో రూ 4,995 కోట్ల విలువైన 13.41 లక్షల టన్నుల బియ్యం తరలించినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సగానికి పైగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది జూన్, జూలైల్లో బియ్యం అక్రమ తరలింపుపై కాకినాడ, చుట్టుపక్కల 13 కేసులు నమోదయ్యాయి. ఇందులో 85 కోట్ల విలువైన 22,947 టన్నులు పట్టుకున్నారు. ఈ కేసుల్లో పాత్రధారులతో పాటుగా సూత్రధారుల పైన ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఈ సమాచారంతో సిట్ రంగంలోకి దిగింది. దీంతో, దీంతో మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. విదేశాలకు బియ్యం ఎగుమతుల ముసుగులో పేదల బియ్యాన్ని దేశం దాటిస్తున్నట్లు ఇప్పటికే ఆధారాలు సేకరించారు.

సూత్రధారులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా పైన నిలదీసారు. షిప్ లో తరలిపోతున్న బియ్యాన్ని గుర్తించారు. పవన్ ప్రమేయంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ అక్రమ రవాణా పైన సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు కాకినాడ పోర్టులో జరిగిన లావా దేవీలతో పాటుగా బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారు.. ఎగుమతుల పేర్లతో పంపుతున్న బియ్యం లెక్కలు...ఎవరికి సరఫరా చేస్తున్నారు.. ఇందులో అధికారుల పాత్ర వంటి వాటి పైన లోతుగా విచారణ చేస్తున్నారు. స్థానికంగా కీలక రాజకీయ నేతల తో పాటుగా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ముఖ్యులు ఇందులో ప్రమేయం ఉన్నట్లు చెబుతున్నారు.
సిట్ విచారణతో
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ప్రభుత్వం కిలో బియ్యం సరఫరా కోసం రూ 43.50 ఖర్చు చేస్తోంది. ీ బియ్యం వినియోగించే వారి నుంచి కొందరు రూ 10కి కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని పాలిష్ చేయించి... విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఏపీతో పాటుగా తెలంగాణ జిల్లాల నుంచి బియ్యం కాకినాడ పోర్టుకు చేకుంటున్నాయి. ఇందులో రాజకీయ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. పోర్టు, కస్టమ్స్, మెరైన్, పౌరసరఫరాలు, పన్నుల శాఖ, రవాణా, పోలీసులు నిరంతం చేస్తున్న తనిఖీల్లో అంతా బాగుందనే నివేదికలు వస్తున్నాయి. దీంతో, ఇప్పుడు సిట్ అసలు ఈ మొత్తం వ్యవహారంలో బియ్యం "పుష్ప" ను పట్టుకొనేందుకు రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications