మీకు నేలపై కూర్చునే అలవాటు ఉందా?
పూర్వకాలంలో అందరూ నేలపై కూర్చునేవారు లేదంటే నేలపై పడుకునేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మంచాలు, కుర్చీలు సోఫాలు లాంటివి రావడంతో నేల స్థానాన్ని ఇవి ఆక్రమించేశాయి. కూర్చోవడానికి, పడుకోవడానికి వీటిని ఉపయోగిస్తుండటం ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది. అయితే దీనివల్ల మన శరీరంపై ఏవిధంగా దుష్ప్రభావాలుంటాయో తెలుసుకుందాం.
కుర్చీలు, సోఫాలకు బదులుగా నేలపై కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నేలపై కూర్చోవడంవల్ల వెన్నెముకను స్థిరీకరించడానికి, శరీరాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మీ వెనుక కండరాలు మరింత చురుకుగా మారతాయి. అంతేకాదు నేలపై కూర్చోవడం వల్ల కుంగిపోయే అవకాశాలు తగ్గుతాయి. మన వెన్నెముక నిటారుగా ఉంటుంది. కానీ వెన్ను ఎముక ఆంగ్ల అక్షరం 'S' ఆకారంలో ఉంటుందని చాలామంది అనుకుంటారు. ఎక్కువసేపు తప్పుడు భంగిమలో కూర్చోకూడదు. దీనివల్ల వెన్నెముకలో నొప్పి వస్తుంది. వెన్నెముక ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కొంత సమయం నేలపై కూర్చోవాలి.

ఏ సహాయం లేకుండా మీరు నేలపై కూర్చొని నిలబడే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు మీరు దీర్ఘాయువు వైపు అడుగులు వేస్తున్నట్లు లెక్క. వెన్నెముకను బలంగా, అనువైందిగా, స్థిరంగా చేస్తుంది. తొడలను దిగువ వీపు, తుంటికి గ్లూటయల్ కండరాలు కలుపుతాయి. తుంటి కండరాలు బలహీనంగా ఉంటే అది మీ నడక, స్థిరత్వం ,శారీరక సమతుల్యతను ప్రతికూలంగా చేస్తుంది. నేలపై కూర్చోవడం వల్ల గ్లూటయల్ కండరాలు బలపడతాయి.
నేలపై కూర్చొని తినడంవల్ల జీర్ణవ్యవస్థ సాఫీగా ఉంటుంది. ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. తినడానికి కూర్చున్న సమయంలో తినడానికి ముందుకు వంగి ఆహారాన్ని మింగుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే సయాటికా నొప్పి నుంచి ఉపశమనం కలగాలంటే నేలపై కూర్చొని భోజనం చేయాలి. ఇది శరీర నరాలను సడలించి నొప్పిని తగ్గిస్తుంది. సయాటికా ఎక్కువైందనిపించిన వెంటే నేలపై కూర్చోవాలి. రోజులో కనీసం 15 నిమిషాల పాటు నేలపై కూర్చోవడంవల్ల శరీరం, ఆరోగ్యం రెండూ బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications