క్రిస్మస్ తాత వేషంలో శివ: చర్చ జరగాలన్న పయ్యావుల

Siva Prasad
తిరుపతి/ విశాఖపట్నం/ హైదరాబాద్ : వినూత్న వేషధారణలతో అందరినీ ఆకట్టుకునే చిత్తూరు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ మరో అవతారంలో కనిపించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం ఉదయం క్రిస్మస్ తాత వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. గాంధీ విగ్రహం వద్ద అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యాంధ్ర పేరున్న చాకెట్లను చిన్నారులకు పంచిపెట్టారు.

వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగాలని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. విశాఖపట్నంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను వినిపిస్తామని ఆయన చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపితో తమ పార్టీ పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నయాని పయ్యావుల చెప్పారు. కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇచ్చేది లేదన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జనగ్ ప్రజలకు అఫిడవిట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని తాము రాష్ట్రపతిని కోరుతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. బిల్లుపై అసలు చర్చే అవసరం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముసాయిదా బిల్లును వెంటనే ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.

చట్టవిరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలను బిల్లు నుంచి తొలగించి, వెంటనే పార్లమెంటులో ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లుపై శాసనసభలో చర్చకు గడువు పొడిగించాలని సీమాంధ్ర నాయకులు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల కల నెరవేరుతున్న సమయంలో తెలంగాణకు అడ్డుపడకుండా చూడాలని రాష్ట్రపతిని కోరుతామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+