ఏపీపై నెలలుగా కలలు: చంద్రబాబుకు 'రాజధాని' షాక్!
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని పైన కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ షాక్ ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిటీ బుధవారం తిరుపతిలో పర్యటించి, ముగించింది.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌లా చేయడం సాధ్యం కాదని చెప్పారట. ఆగస్టు నెలాఖరులోగా తాము నివేదిక ఇస్తామని చెప్పారు.

చంద్రబాబు నాయుడు మొదటి నుండి ఏపీని సింగపూర్‌లా చేస్తానని చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలోను చంద్రబాబు టీడీపీని గెలిపిస్తే ఏపీని సింగపూర్‌లా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంతేకాదు, ఏపీ అభివృద్ధిలో సింగపూర్ సహకారం కూడా కోరారు. రాజధాని నిర్మాణం కోసం కూడా సింగపూర్ సహకారం కోరారు. ఈ నేపథ్యంలో ఏపీని సింగపూర్‌లా చేయడం సాధ్యం కాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పడం గమనార్హం.
కాగా, కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తాము నివేదికను రూపొందిస్తామన్నారు. తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని చాలామంది కోరుతున్నారని చెప్పారు. అందరి అభిప్రాయాలను తీసుకొని తమ నివేదికలో పొందుపరుస్తామని చెప్పారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications