అన్ని ప్రాంతాలను, ఏపీ రాజధాని ఇలా ఐతే..: కమిటీ
చిత్తూరు: చిన్న, పెద్ద నగరాలను కలుపుతూ రాజధాని ఉంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన వేసిన శివరామకృష్ణన్ కమిటీ బుధవారం అభిప్రాయపడింది. శివరామకృష్ణమన్ కమిటీ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో బుధవారం పర్యటించింది.
ఎస్వీ సెనెట్ హాలులో ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే రాజధానికి అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండాలన్నారు. ఇప్పటి వరకు తమకు ఆరువేల ప్రతిపాదనలు అందాయన్నారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని నివేదిక ఇస్తాన్నారు. కొత్త రాజధాని ఏర్పాటుపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులతో కమిటీ భేటీలు నిర్వహిస్తోంది.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. శివరామకృష్ణన్ వెంట కమిటీ సభ్యులు జగన్ షా, కెటి రవీంద్ర, నితిన్‌తో పాటు హైదరాబాదు పట్టణ ప్రణాళికా సంచాలకులు ఉన్నారు.
ముందుగా అనంతసాగరం చెరువును కమిటీ సభ్యులు పరిశీలించారు. ఆ తర్వాత అనంతపురం నగరంలో పర్యటించారు. బెంగళూరు హైవే, స్వాతంత్రోద్యమ కాలం నాటి క్లాక్ టవర్‌ను సందర్శించారు. అనంతరె రెవెన్యూ భవన్‌కు చేరుకొని జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, జిల్లాకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. సోమవారం కర్నూలులో పర్యటించారు.












Click it and Unblock the Notifications