ఓటీటీలోకి రూ. 10 వేల కోట్లు కొల్లగొట్టిన సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
హాలీవుడ్ సినిమాలు అనగానే జేమ్స్ కేమెరూన్, క్రిస్టోఫర్ నోలన్ మాత్రమే గుర్తుకువస్తారు. జేమ్స్ కేమెరూన్ అవతార్ సిరీస్ తో అద్భుతాలు సృష్టించగా.. నోలన్ బ్యాట్ మెన్, డార్క్ నైట్, ఇంటర్ స్టెల్లార్ చిత్రాలతో మెప్పించారు. తాజాగా హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మూవీ "ది ఒడిస్సీ" బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 17 న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అలా నోలన్ కెరీర్ లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలవడంతో పాటు అటు ఐమాక్స్ చరిత్రలోనూ సరికొత్త రికార్డును సృష్టించింది.
ది ఒడిస్సీ మూవీ ప్రపంచవ్యాప్తంగా $1.1 బిలియన్ వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు నోలన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన 'ది డార్క్ నైట్ రైజెస్' రికార్డును ఈ మూవీ అధిగమించింది. అటు జేమ్స్ కేమెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ మూవీని కూడా ది ఒడిస్సీ మూవీ అధిగమించడం విశేషం. 'అవతార్' మూవీ IMAX ద్వారా సుమారు $271 మిలియన్లు రాబట్టగా.. 'ది ఒడిస్సీ' ఇప్పటికే $289 మిలియన్లు వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది. చైనా, జపాన్ లాంటి భారీ మార్కెట్లలో ఇంకా విడుదల కాకముందే ది ఒడిస్సీ మూవీ ఈ ఘనత సాధించడం విశేషం.

అయితే ది ఒడిస్సీ మూవీ నుంచి ప్రేక్షకులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ తెలిపింది. ఆగస్టు 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆపిల్ టీవీ ఓటీటీలలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి ఇండియాలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్ మాట్ డామన్, అన్నా హాథ్ వే, టామ్ హాలండ్ కీలక పాత్రల్లో నటించారు. గ్రీకు పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ది ఒడిస్సీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంలో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ టేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అలాగే ఉత్కంఠంగా సాగిన మాట్ డామన్, అన్నా హాథ్ వే, టామ్ హాలండ్ యాక్టింగ్ కీలకంగా నిలిచాయి.












Click it and Unblock the Notifications