త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు..? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

టీవీకే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ చరిత్ర సృష్టించారు. కంచు కోటలుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను వెనక్కు నెట్టి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తమిళనాట జెండా ఎగరేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పటినుంచి విజయ్ తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే విజయ్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఎప్పటికప్పుడు పథకాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలో విజయ్ కు సన్నిహితురాలిగా పేరున్న ప్రముఖ సినీనటి త్రిషను టార్గెట్ చేస్తున్నారు నాయకులు. పదేపదే విజయ్‌ ను రెచ్చగొట్టేందుకు త్రిషను రాజకీయాల్లోకి తెస్తున్నారు.


తాజాగా నటి త్రిషపై అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపాయి. విజయ్‌ కు 'ప్రియమైన' త్రిషను తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారు..? అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇటీవల తూత్తుకుడిలో జరిగిన జయలలితా పేరవై సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓటీటీలోకి విజయ్ 'జన నాయగన్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
ఓటీటీలోకి విజయ్ 'జన నాయగన్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

తమిళనాడులోని టీవీకే ప్రభుత్వం కీలక పదవుల్లో సీఎం విజయ్‌ కు అత్యంత సన్నిహితులను నియమిస్తోందని ఉదయ్‌ కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన సినిమాల్లో పనిచేసిన నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో పాటు ఇతరులకు పదవులు కట్టబెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. అలాగే కావేరీ నది నీటిని కర్ణాటక నుంచి విడుదల చేయించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని ఆయన కీలక ఆరోపణలు చేశారు.

ఇది తథ్యం: డీలిమిటేషన్ పై తేల్చి చెప్పిన సీఎం విజయ్- కేంద్రానికి 4 డిమాండ్లు
ఇది తథ్యం: డీలిమిటేషన్ పై తేల్చి చెప్పిన సీఎం విజయ్- కేంద్రానికి 4 డిమాండ్లు

అన్నాడీఎంకే నేత ఉదయ్‌ కుమార్ చేసిన వ్యాఖ్యలపై త్రిష అభిమాన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు త్రిష ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురై నగరం వ్యాప్తంగా ఖండన పోస్టర్లు వెలిశాయి. తమ అభిమాన నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ పోస్టర్లలో పేర్కొన్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయ్‌ కుమార్‌ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తూత్తుకూడి జిల్లా పోలీసులకు టీవీకే కార్యకర్త ఒకరు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

Trisha When will Trisha be appointed Deputy CM AIADMK leader RB Udhayakumar s remarks sparks row

ఇక ఇటీవల డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశిస్తూ డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా సినీ నటి త్రిషను లక్ష్యంగా చేసుకుని రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తుండటం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+