రాజధాని: ఆగస్ట్31 కల్లా రిపోర్ట్, రాజమండ్రి టు బెజవాడ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాజధానికి సంబంధించి ఆగస్టు 31వ తేదీ నాటికి తాము కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదికను అందిస్తామని శివరామకృష్ణమన్ కమిటీ ఆదివారం తెలిపింది. శివరామకృష్ణన్ కమిటీ రాజమండ్రి పర్యటన ముగించుకొని విజయవాడకు బయలుదేరింది.
ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు రతన్ రాయ్ విలేకరులతో మాట్లాడారు. కొత్త రాజధాని ఏర్పాటుపై ఆగస్టు నెలాఖరులోగా కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు. ఇది నిపుణుల కమిటీ మాత్రమేనని, సలహాలు మాత్రమే నివేదిక రూపంలో అందజేస్తామని వారు తెలిపారు.

రాజమండ్రి, విశాఖలో కూడా అనువైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. జిల్లా అధికారులతో కమిటీ సమావేశమై నివేదికలు సేకరించినట్లు చెప్పారు. అనారోగ్య కారణాల వల్లన శివరామకృష్ణన్ రాలేదన్నారు. తమ అజెండాలోని అన్ని ప్రాంతాలను హోంమంత్రిత్వ శాఖ పేర్కొన్న ప్రమాణాల నేపథ్యంలో పరిశీలించి నివేదిక తయారు చేయడమే తమ బాధ్యత అన్నారు.
అంతకుముందు రాజానగరాన్ని కమిటీ సభ్యులు పర్యటించారు. వీరితోపాటు టిడిపి నేత మురళీ మోహన్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు, స్వచ్చంధ సంస్థలు కమిటీని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏ ఏడాది జూన్ 2న ఆంధ్రప్రదేశ్ విభజన కానుందని రతన్‌రాయ్ తెలిపారు. కాగా, సీమాంధ్ర రాజధానిపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీ సీమాంధ్రలో పర్యటిస్తోంది.












Click it and Unblock the Notifications