రెచ్చిన మావోయిస్టులు: మందుపాతర పేలి 6గురు జవాన్లు మృతి
ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు బుధవారం నాడు రెచ్చిపోయారు. పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేసి మందుపాతర పేల్చారు.
విశాఖ: ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు బుధవారం నాడు రెచ్చిపోయారు. పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేసి మందుపాతర పేల్చారు. మందుపాతరతో స్థానికంగా ఉన్న కల్వర్టును పేల్చారు.

సుంకి రోడ్డులో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్టులు పేల్చేశారు. వాహనంలో 13 మంది పోలీసులు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఆరుగురు మృతి చెందగా, 7గురు గాయాలతో బయటపడ్డారు.
ఈ సంఘటన సుంకి రోడ్డు పరిధిలోని ముంగిపొదేరు ఘటన వద్ద చోటు చేసుకుంది. కాగా, కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోలు ఈ మందుపాతర పేల్చినట్లుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications