సిఎం కెసిఆర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరారు.

కాగా, నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద సిఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం మరో వాహనాన్ని ఢీకొంది. దీంతో కాన్వాయ్‌లో వరుసగా వెళుతున్న వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా యాదగిరిగుట్టలో పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. కొండపైకి ఇతర వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.

Small accident occurred in CM KCR's convoy

గుట్టకు చేరుకన్న సిఎం కెసిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ యాదగిరిగుట్టకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్, చినజీయర్‌స్వామి యాదాద్రికి చేరుకున్నారు. యాద్రాద్రికి తిరుమల తరహాలో హంగులు చేకూర్చే మాస్టర్‌ప్లాన్ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.

గవర్నర్ నరసింహన్, చినజీయర్‌స్వామితో కలిసి సీఎం పనులు ప్రారంభించనున్నారు. పెద్దగుట్ట వద్ద అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై జరిగే అథారిటీ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+