అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: తల్లిని కాటేసిన పాము, పాలు తాగిన ఏడాది కొడుకూ మృతి

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాము కాటుకు ఓ మాతృమూర్తి మరణించగా, ఆమె పాలు తాగిన మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. హృదయ విదారకమైన స్థానికంగా అందర్నీ కంటతడి పెట్టించింది.

బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొజ్జేపల్లికి చెందిన లింగన్న భార్య చంద్రకళ(21) గురువారం ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి పశువుల పాకను శుభ్రం చేస్తుండగా అక్కడే ఉన్న పాము ఆమె కాలుని కాటువేసింది. అయితే కాలికున్న రక్తపుగాట్లను పాముకాటుగా భావించక.. తన పని తాను చేసుకుంది చంద్రకళ.

అప్పుడే ఏడాది వయసున్న ఆమె కుమారుడు వంశీ ఏడుపు మొదలు పెట్టాడు. వెంటనే ఆమె తన చిన్నారికి పాలు పట్టింది. పాలు తాగిన చిన్నారి అప్పకప్పుడే అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు చంద్రకళకు పాము కాటువేసినట్లు నిర్ధరించుకున్నారు.

Snake-bite kills woman; son too dies after drinking her milk

వెంటనే కుటుంబీకులు తల్లిని గుత్తి ఆర్‌ఎస్‌లోని నాటువైద్యుడి వద్దకు తరలించారు. చిన్నారిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు తల్లి, బిడ్డను అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ వీరిద్దరూ మరణించారు.

తల్లీ, కుమారుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. భార్య, కుమారుడి మృతితో లింగన్న, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ గ్రామానికి చెందిన లింగన్న భార్య చంద్రకళ (30)ను గురువారం తెల్లవారుజామున పాము కాటువేసింది. దీన్ని గమనించని ఆమె.. కాలి పట్టీ గుచ్చుకుని ఉంటుందని భావించి ఇంటి పనులు చేసుకోవడం ప్రారంభించింది.

English summary
In a horrific incident, an 18-month-old boy died after he consumed the milk of his mother, who was earlier bitten by a snake. The mother too died. The incident took place at Latchanapally village of Gooty mandal in Anantapur district in the early hours of Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X