శోభా నాగిరెడ్డి గెలుపు కోసం కూతురు అఖిల రోడ్డు షో
కర్నూలు: దివంగత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డిని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని శోభా కూతురు భూమా అఖిలప్రియ కోరుతున్నారు. తన అమ్మ శోభను గెలిపించాలంటూ ఆమె రోడ్డు షో నిర్వహిస్తున్నారు.
అమ్మను భారీ మెజార్టీతో గెలిపించి ఆమెకు ఘనమైన నివాళి అర్పిద్దామని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం మండలంలోని భాగ్యనగరం, కొండాపురం, రామచంద్రాపురం, దొర్నిపాడు, అమ్మిరెడ్డినగరం, అర్జునాపురం గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు.

కొండాపురం గ్రామంలోలో ఆమె మాట్లాడుతూ.. అమ్మ ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసమె తపించేవారన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి శోభా నాగిరెడ్డి ఎంతో కృషి చేశారని భూమా నారాయణ రెడ్డి అన్నారు. భారీ మెజార్టీతో ఆమెను గెలిపించి రుణం తీర్చుకుందామన్నారు.
కాగా, శోభా నాగిరెడ్డి ఆరు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పార్టీ నాయకురాలు షర్మిల ప్రచారంలో పాల్గొన్న ఆమె రాత్రి పదకొండు గంటల సమయంలో తిరిగి వెళ్తుండగా.. ఆళ్లగడ్డ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారు. ఆళ్లగడ్డలో ఎన్నికలు నిర్వహిస్తామని, శోభా గెలిస్తే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఈసి ప్రకటించింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications