AP Pensions: ఏపీలో పెన్షన్ దారులకు మే 1 టెన్షన్-ఆదేశాల కోసం ఎదురుచూపులు !
గత నెలలో ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత చెలరేగిన రచ్చ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాలంటీర్ల గైర్హాజరీలో పెన్షన్లను ఇంటి వద్దే పంపిణీకి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలంటూ ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఏర్పాట్లు చేసుకోకపోవడంతో గత నెలలో పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయి. ఎన్నికల వేల పెన్షన్ల పంపిణీని విపక్షాలు అడ్డుకుంటున్నాయన్న మెసేజ్ ను జనంలోకి పంపాలన్న వైసీపీ ఆలోచనకు అధికారులు కూడా తోడవడంతో పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే గతంలో జరిగిందేదో జరిగింది, ఈసారి అయినా మే1న ఠంచనుగా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇవాళ 26వ తేదీ వచ్చేసినా ఇంకా అధికారులు మౌనం వీడటం లేదు. దీంతో పెన్షన్ల పంపిణీ మే1న జరుగుతుందా లేదా అనే టెన్షన్ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం ఈసీ జోక్యం చేసుకుని ఈసారి సకాలంలో పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ చేసేలా మరోసారి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాయి.

గత నెలలో పెన్షన్లను సచివాలయానికి వచ్చి తీసుకోవాలని అధికారులు చెప్పేయడంతో వృద్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. మండు వేసవిలో సచివాలయాలకు రాలేక, వచ్చినా అక్కడ వేచి చూసే పరిస్ధితి లేక ఇబ్బంది పడ్డారు. ఇదే అదనుగా వైసీపీ శ్రేణులు వారిని మంచాలపై సచివాలయాలకు మోసుకొచ్చి ప్రచారం కోసం ప్రయత్నించారు. కానీ ఈసారి అయినా ముందే ఉతత్తర్వులు వస్తాయని భావించినా అలా జరగడం లేదు. దీంతో పింఛన్ దారులకు మే 1 టెన్షన్ పట్టుకుంది.












Click it and Unblock the Notifications