వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఏమైంది : వివాదాలు- రెబల్స్-సస్పెన్షన్లు : ఎన్నికలపై ఎఫెక్ట్ - ముందుకే..!!

|
Google Oneindia TeluguNews

గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక దాని తరువాత మరొకటి సమస్య ఎదరవుతోంది. ఎవరు అధికారంలోకి రావాలన్నా కీలక మైన గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధిస్తేనే సాధ్యం. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఆరు సీట్లు మినహా..మిగిలిన అన్ని సీట్లు వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. 2019 ఫలితాల తరువాత నుంచే..2024 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో పట్టు కోసం సీఎం జగన్ పావులు కదిపారు. అందులో భాగంగానే తన తొలి కేబినెట్ లో సామాజిక సమీకరణాలు అమలు చేసారు. రాజ్యసభ ఎంపికలో ప్రాధాన్యత ఇచ్చారు. రెండో విడత కేబినెట్ ఏర్పాటులోనూ కొత్త లెక్కలతో ఎంపిక చేసారు. గోదావరి జిల్లాలకే హోం మంత్రి కేటాయించారు. అయితే, గోదావరి జిల్లాల్లో వైసీపీలో అంతర్గత సమస్యలు ఇప్పుడు వెంటాడుతున్నాయి.

వైసీపీలో కొందరు తీరుతో...

వైసీపీలో కొందరు తీరుతో...

కొందరు పార్టీ నేతలు దారి తప్పుతున్నారు. వారి వ్యవహార శైలి ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. ఇవి అధికార పార్టీకి సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ రాజు రెబల్ గా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ.. వైసీపీ ప్రభుత్వం పైన నిత్యం ఢిల్లీ వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఆయన పైన అనర్హత వేటు కోసం వైసీపీ ప్రయత్నించినా..ఇప్పటికీ సాధ్యపడలేదు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం పార్టీకి డామేజ్ చేసింది. దీంతో..వెంటనే అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. కానీ, ఆయన వ్యవహార శైలి వైసీపీ పైన విమర్శలకు కారణమైంది.

Recommended Video

BJP Senior Leader Gokaraju Ganga Raju Into YSRCP || బీజేపీతో గేమ్ స్టార్ట్ చేసిన జగన్ || Oneindia
ప్రతిపక్షాలకు అస్త్రాలుగా

ప్రతిపక్షాలకు అస్త్రాలుగా

ఇక, కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తో కోనసీమలో విధ్వంసం చోటు చేసుకుంది. ఈ విధ్వంసం వెనుక టీడీపీ - జనసేన ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తుంటే..వైసీపీ నేతలు సైతం ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అదే విధంగా నర్సాపురం జిల్లా సాధన సమితి ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ పొలిటీషియన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చేసిన బహిరంగ విమర్శలు పార్టీకి నష్టం చేసేవిగా మారాయి. కొద్ది రోజులుగా సుబ్బారాయుడు తీరు గమనిస్తూ వచ్చిన వైసీపీ అధినాయకత్వం ఆయనపైన సస్పెన్షన్ వేటు వేసింది. స్థానిక ఎమ్మెల్యే ..కొత్తగా ప్రభుత్వ విప్ గా ఖరారైన ప్రసాదరాజు పైన కొత్తపల్లి బహిరంగంగానే విమర్శలు చేసారు. చెప్పుతో కొట్టుకొని కలకలం రేపారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి 2019లో తప్ప.. అన్ని సార్లు పోటీలో ఉన్నట్లు చెప్పారు.

ఎన్నికల సమీకరణాలపై ప్రభావం చూపేనా

ఎన్నికల సమీకరణాలపై ప్రభావం చూపేనా

నియోజకవర్గంలోని అన్ని వర్గాలు, పార్టీల్లో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందన్నారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసినప్పుడు కూడా సొంత బలం ఆధారంగానే గెలిచానన్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందంటూ వ్యాఖ్యానించటంతో ఇక ఆయన పైన చర్యలకు నిర్ణయించారు. తాజాగా, మీడియా సమావేశంలో సుబ్బారాయుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. పార్టీలో క్రమశిక్షణ.. తప్పు చేసిన వారిని వదిలేది లేదనే సంకేతాలు ఇస్తూ పార్టీ అధినాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే, వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికల్లో వైసీపీ పైన ప్రభావం చూపిస్తాయా అనే చర్చ మొదలైంది.

అయినా కఠిన నిర్ణయాలతోనే ముందుకు

అయినా కఠిన నిర్ణయాలతోనే ముందుకు

కానీ, ఉపేక్షిస్తే ఇంత కంటే ఎక్కువగా నష్టం జరుగుతుందనే అంచనాకు వైసీపీ వచ్చింది. మంత్రివర్గ ప్రక్షాళన..పార్టీ పదవుల నియామకం తరువాత గోదావరి జిల్లాల్లో వైసీపీ పొలిటికల్ యాక్టివిటీ తగ్గినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలే ఈ రెండు జిల్లాల్లో ఎన్నికల వేళ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలుస్తాయి. ఇప్పుడు.. చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీలో కీలక చర్చకు..భవిష్యత్ పరిణామాలపైన అంచనాలకు కారణంగా నిలుస్తున్నాయి.

English summary
The developments taking place in Godavari districts are causing political debate in the YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X