వైద్యం వికటించి వ్యక్తి మృతి: వైద్యుడిపై దాడి

అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారు వైద్యుడిపై దాడి చేశారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వైద్యుడికి రక్షణ నిలిచి అతడ్ని ఆస్పత్రి లోపలికి పంపించారు. ఆందోళన చేస్తున్న మృతుల బంధువులను ఆస్పత్రి బయటకు తరలించారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8మంది మృతి
కృష్ణా: జిల్లాలోని బాపులపాడు మండలం వీరవల్లి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ప్రమాదకర రసాయనాల టిన్నులతో తణుకు వెళ్తున్న మినీ వ్యాను వీరవల్లి పెట్రోలు బంకు వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టడంతో దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు రసాయన టిన్ ఒకటి పగిలి దట్టంగా పొగలు వ్యాపించాయి. రసాయనాల తీవ్రతకు వ్యాన్ ట్రక్కులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గాయాలపాలైన మరికొందర్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన వారుగా భావిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని చిలముత్తూరు మండలంలో కొడికొండ చెక్ పోస్టు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు వోల్వో బస్సు ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను హిందూపురం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications