రాజకీయ కక్షలు: టిడిపి నాయకుడిపై కత్తులతో దాడి, విషమం

తీవ్రంగా గాయపడిన ప్రసాదరావును హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనగా ఉన్నట్లు తెలిసింది. కాగా, గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.
బాధితుడు ప్రసాదరావు పరిస్థితి తెలుసుకునేందుకు మండల టిడిపి కన్వీనర్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసరావు, అతని అనుచరులు పెద్ద సంఖ్యలో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అవనిగడ్డ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
48 మంది ఎర్రచందనం కూలీల అరెస్ట్
చిత్తూరు: జిల్లాలో 48మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 50లక్షల విలువ చేసే 42 ఎర్రచందనం దుంగులు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications