విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నంవారికి ముఖ్య గమనిక
విజయవాడ డివిజన్‌లో భద్రతా నిర్మాణ పరమైన పనులు జరుగుతుండటంతో ఈనెల 21 నుంచి 27 వరకు కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాజమండ్రి- విశాఖ (07466), విశాఖ- రాజమండ్రి (07467).. కాకినాడ- విశాఖ (17247), విశాఖ- కాకినాడ (17268) ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈనెల 21, 22వ తేదీల్లో ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్ (22643).. ఈనెల 23, 24 తేదీల్లో బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్ (12509), 27న కొయంబత్తూర్-సిల్చర్ ఎక్స్‌ప్రెస్(12515) రైళ్లు వయా నిడదోవలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లించిన మార్గంలో నడవనున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
కొన్ని రైళ్ల సర్వీసుల రాకపోకల్లో కూడా మార్పులు చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు కాకినాడ - విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ రద్దు చేశారు. విశాఖపట్నం - కాకినాడ ప్యాసింజర్ ప్రత్యేక రైలు, రాజమండ్రి - విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్, విశాఖపట్నం - రాజమండ్రి ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లు రద్దయ్యాయి.

విశాఖపట్నం - విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్.. విజయవాడ - విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్.. గుంటూరు - విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా రద్దయ్యాయి. ఈ నెల 21వ తేదీవరకు విశాఖపట్నం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దైంది. ఈ నెల 20వ తేదీన కోయంబత్తూర్ - సిల్చార్ ఎక్స్‌ప్రెస్ రైలును దారి మళ్లించారు. ప్రయాణికులు గమనించి రైల్వేతో సహకరించాలని కోరారు. ఈ తేదీల్లో మినహా మిగతా రైళ్లన్నీ యథావిధిగానే తిరుగుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications