సాక్షి పత్రిక ప్రింటింగ్ ఖర్చు శిల్పా లెక్కలోకి: వైసిపికి 'టిడిపి' షాక్
వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని డబ్బుతోనే గెలిపించాలని ఆ పార్టీ అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.
నంద్యాల: వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని డబ్బుతోనే గెలిపించాలని ఆ పార్టీ అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సాక్షి పత్రిక ద్వారా ప్రజల్ని అవాస్తవాలతో మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.

కరపత్రాల ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చు శిల్పా అభ్యర్థి ఖాతాలో
అవాస్తవాలు అభూత కల్పనలతో సాక్షి పత్రికలో రాతలు రాస్తున్నారని, కర్రపత్రాల ముద్రణకు అయ్యే ఖర్చు అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఖాతాలో జమ చేయాలని సోమిరెడ్డి డిమాండు చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Recommended Video


నంద్యాలలోనే అభివృద్ధి అబద్దం!
రాష్ట్రంలో ఎక్కడా చేయని ప్రగతిని నంద్యాలలో చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేయడం సబబు కాదని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పట్టణ గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, ఇందులో భాగంగానే నంద్యాలలో పట్టణ గృహనిర్మాణ పథకం చేపట్టామన్నారు.

జగన్ పత్రికను నమ్మడమా
అమృత్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా కుళాయిల ద్వారా నీరు అందించే పథకం చాలా పట్టణాల్లో ఇప్పటికే అమలులో ఉండేదని సోమిరెడ్డి అన్నారు. ఇదే రీతిన నంద్యాలలోనూ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాల గురించి ప్రచురించని జగన్ పత్రిక సాక్షిని ఎవరూ నమ్మరన్నారు.

భూమా కుటుంబం చేసింది అందరికీ తెలుసు
ఆగస్టు 2వ తేదీన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని, ఇందులో వేలాది మంది ప్రజలు పాల్గొంటారని సోమిరెడ్డి భూమా కుటుంబం నంద్యాల ప్రాంతానికి చేసిన సేవలకు ఆ కుంటుంబం పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతితో టిడిపి అభ్యర్థి ఘన విజయం ఖాయమన్నారు. టిడిపి ఉద్యోగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని వైసిపి అనవసర రాద్దాంతం చేస్తోందని, అందులో వాస్తవం లేదని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు.












Click it and Unblock the Notifications