జైరాం పగటి వేషగాడు: సోమిరెడ్డి, చెరపట్టాడని ఫైర్

ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో సీతను రావణుడు చెరబట్టినట్లు కేంద్రమంత్రి జైరాం రమేష్ సీమాంధ్ర ప్రజలను చెరపట్టాడని ఆరోపించారు.
రెంటల్ పార్టీగా మారింది: టిడిపిపై ఆనం
తెలుగుదేశం పార్టీపై కాంగ్రెస్ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి రెంటల్ పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు, కార్యకర్తలు కరువయ్యారని, టిడిపి కేవలం ఫ్లెక్సీల్లో మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.
నెల్లూరు నగరంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అందరి అభిమానం పొందిన వారినే మేయర్‌గా ఎంపిక చేస్తామని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆనం వివేకానంద రెడ్డి చెప్పారు. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులందరూ మంచి మార్కులతో పాస్ కావాలని, అందుకోసమే ప్రతీ విద్యార్థికి గ్రీటింగ్ కార్డులు పంపిస్తున్నానని ఆనం తెలిపారు.












Click it and Unblock the Notifications