'బస్సులు ధ్వంసం చేయమని వైయస్ జగన్ అనటం సరికాదు'
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభం దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకుంటే తాము కూడా ప్రత్యక్ష పోరులోకి దిగుతామని తెలుగుదేశం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో చేస్తోన్న చర్చలు ఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని ఎమ్మెల్సీ సోమిరెడ్డి కోరారు. కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని, అవి ఫలిస్తాయన్న నమ్మకం ఉందని అన్నారు. వైసీపీ చేస్తున్న చేస్తున్న బంద్‌తో జన జీవనం స్తంభిస్తోందని, ఇలా ధర్నాలు చేపట్టడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
బస్సులు ధ్వంసం చేయమని వైయస్ జగన్ అనటం సరికాదని ఆయన అన్నారు. నవ్యాంధ్ర రాజధానికి భూసేకరణ అవసరమని, సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాజధాని నిర్మాణం సాధ్యమని సోమిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications