బట్టలిప్పి కొడతారు: నారా లోకేష్‌పై మంత్రి, సోమిరెడ్డి పైర్

నెల్లూరు/ హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు స్థానం లేదని, ఆ పార్టీల నాయకులను ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆంధ్ర వ్యక్తులు తెలంగాణలో నాయకత్వం వహిస్తామంటే ఎవరూ ఊరుకోరని, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు ఏం పని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు లోకేష్‌ను బట్టలిప్పి మరీ కొడతారని మహేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి, దయాకర్ రావు వంటి టిడిపి నేతలు ఏం ముఖం పెట్టుకనవి లోకేష్ గురించి మాట్లాడుతారని ఆయన అడిగారు.

Nara Lokesh

ఇదిలావు, తెరాసలో చేరిన తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యులు నారా లోకేష్‌పై విమర్శలు చేయడంపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మరెడ్డి, ఎమెల్సీ ప్రకాష్‌గౌడ్ అధికార దాహంతో ఆ రాష్ట్ర అధికార పార్టీ టిఆర్‌ఎస్‌లో చేరుతూ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌పై నిందలు వేయడం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు.

గురువారం తన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నాయకులకు నీతి ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో నారా లోకేష్ ఎటువంటి జోక్యం చేసుకోక పోయినా కేవలం అధికారం దాహం కోసమే ఆయనపై నిందలు వేస్తున్నారన్నారు.

టిడిపికి రాజీనామా చేస్తూ తెరాసలో చేరిన శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీలో నారా లోకేష్ స్థాయిపై విమర్శలు చేశారు. నారా లోకేష్‌ నాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణ టిడిపి నాయకులు కూడా నారా లోకేష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. దీనిపై తెరాస నాయకులు విరుచుకుపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+