వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధపడుతున్నారు: జగన్‌పై సోమిరెడ్డి, ఎప్పుడు జైలుకెళ్తారో..: రావెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy lashes out at YS jagan for blaming Chandrababu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. హుధుద్ తుఫాను కోసం వచ్చిన డబ్బుల్లో నాలుగు వందల కోట్లు సీఎం చంద్రబాబు జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించేందుకు ఆయనకు ఏమైనా పిచ్చా అని ప్రశ్నించారు.

జగన్ తన తండ్రి ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోచుకున్నాడని ఆరోపించారు. రాష్ట్రం బాగుండాలని జగన్‌కు ఏమాత్రం లేదన్నారు. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా జగన్ అనర్హుడన్నారు. 11 సీబీఐ కేసుల్లో దోషిగా జగన్ ఉన్నాడన్నారు. సీమాంధ్రను స్కామాంధ్ర చేస్తాడనే జగన్‌కు ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు.

జగన్ మాట, తీరు అంతా కృత్రిమమేనని ఆరోపించారు. ఆ పార్టీలో చేరిన వారు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహకారం ఇవ్వాల్సింది పోయి ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. తాము ఇచ్చిన వాగ్దానాల నుండి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడం లేదన్నారు.

అయితే, జగన్‌కు మాత్రం రాష్ట్ర అభివృద్ధి ఇష్టం లేనట్లుగా ఉందన్నారు. రైతులు, మహిళల విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. తమ పైన ఆరోపణలు చేసేందుకు జగన్‌కు ఏమాత్రం అవకాశం లేదన్నారు. మా వాగ్ధానాలు నిలబెట్టుకుంటామన్నారు. వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టింది తామే అన్నారు. రైతులు అభివృద్ధే చంద్రబాబు తొలి ప్రాధాన్యత అన్నారు.

ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియదు: రావెల

వైయస్ జగన్ ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియదని మంత్రి రావెల కిషోర్ బాబు వేరుగా అన్నారు. అలాంటి వ్యక్తికి తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన వికలాంగుల దినోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, మాణిక్యాల రావు, ప్రభుత్వ విప్‌ కేవీ సత్యనారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వికలాంగుల పట్ల సమాజం బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. వారికి అన్ని విధాలా సహకరిస్తే ఏ పనైనా చేస్తారన్నారు. స్టీఫెన్ హాకింగ్, ద్వారం వెంకటస్వామి వంటి వారు వికలాంగులైనప్పటికీ.. ఎన్నో సాధించారన్నారు. వికలాంగులకు మానసిక స్థైర్యం కావాలన్నారు.

తమ హయాంలో అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు వేయించామన్నారు. వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు కోటేశ్వర రావు అనే వికలాంగుడిని వికలాంగ చైర్మన్‌గా నియమించారు. వికలాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

కాగా, రాజమండ్రి పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి, స్నాన ఘట్టాలను చంద్రబాబు సందర్శించనున్నారు.

English summary
Somireddy Chandramohan Reddy lashes out at YS jagan for blaming Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X