కెటిఆర్‌ను గుంటూర్లో చదివించావేం?: సోమిరెడ్డి కౌంటర్

తెలంగాణ ప్రాంత నేతలు హైదరాబాద్ సిర్ఫ్ హమారా అని చెబుతున్నట్లుగా తాము కూడా చెబుతున్నామన్నారు. హైదరాబాద్ తమదే అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకు వచ్చేందుకు కెసిఆర్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎంతమంది కెసిఆర్‌లు, కె కేశవ రావులు వచ్చినా హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులను ఏం చేయలేరన్నారు. కెసిఆర్‌కు ఏమాత్రం సంస్కారం లేదని మండిపడ్డారు. తెరాస, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలు నెల రోజులు కుస్తీ పట్టినా నిజాం కళాశాల మైదానం నిండలేదని ఎద్దేవా చేశారు.
కర్నూలులో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభ కోసం సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు లక్షల మంది తరలి వచ్చారని చెప్పారు.












Click it and Unblock the Notifications