జగన్ యాగీ ఎందుకో, తండ్రి చేసింది ఎంత: సోమిరెడ్డి

రుణాలు చెల్లించిన రైతులకు వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి చెల్లించింది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమేనని ఆయన అన్నారు. తమ తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ రుణాలను మాఫీ చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇందుకు 40 వేల కోట్ల రూపాయలు భరించాల్సి వస్తుందని, ఇది తమ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని ఆయన అన్నారు.
తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన దానికి రెట్టింపు రుణమాఫీ చేసినా జగన్ హర్షించడా అని ఆయన అడిగారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత రుణమాఫీ చేయలేదని ఆయన అన్నారు. దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని జగన్ పిలుపునివ్వడం దారుణమని ఆయన అన్నారు.
రైతు రుణాల మాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మూడు రోజుల పాటు నరకాసుర వధగా పరిగణించి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications