పవన్ కల్యాణ్‌నే అడగాలి, చాలా మంచి హీరో: సోమిరెడ్డి

 Somireddy says Pawan Kalyan is great Hero
హైదరాబాద్: హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంచి హీరో అని, వ్యక్తిగతంగా పదిమందికి సాయం చేస్తారనే పేరు ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ లాంటి వారు ప్రజా జీవితంలోకి రావాలన్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయం ఆయననే అడగాలని సోమిరెడ్డి సూచించారు.

మరోవైపు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీల పైన నిప్పులు చెరిగారు. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బ్రహ్మానందం, అలీలను మరిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.

జగన్‌ది కాంగ్రెసు డిఎన్ఏనే అని దిగ్విజయ్ స్వయంగా చెప్పారన్నారు. దిగ్విజయ్ పూటకో మాట మాట్లాడుతారని ఆరోపించారు. మరో మూడు నాలుగు నెలల్లో ప్రభుత్వం పోతుందని, ఇప్పుడు పోతు పోతూ ఎపికి మరణ శాసనం రాస్తారా అని నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు మొక్కుతున్నారని మండిపడ్డారు. సిడబ్ల్యూసి నిర్ణయం సోనియా చెంచాలకు తప్ప తెలుగు ప్రజలకు శిరోధార్యం కాదన్నారు.

జివోఎం రాజ్యాంగం కంటే పెద్దదేమీ కాదన్నారు. అసెంబ్లీని బైపాస్ చేసి విభజిస్తే తెలుగు ప్రజలు బట్టలూడదీసి కొడతారన్నారు. కడప పౌరుషమని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు సోనియా దయాదాక్షిణ్యాల కోసం పాకులాడుతోందని, అందుకు ఆ పార్టీ నేత దాడి వీరభద్ర రావు మాటలే నిదర్శనమన్నారు. జగన్ ఈడి కేసులను గాలి కొదిలేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+